పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన శరీరం ఎంతో అందంగా ఆరోగ్యంగా పెరుగుతుంది.. అందుకే మనం పుట్టినప్పటి నుండి కూడా మనకు ప్రత్యేకమైన ప్రతి దానిలో ఉంటుంది.. అన్నప్రాసనలో తేనే.. ఇష్ట దైవానికి అభిషేకం చేసే సమయంలోను తేనే.. రోజు తాగే టీలో తేనే ఇలా మన జీవితంలో ముఖ్యమైన ప్రతి దానిలో తేనే కచ్చితంగా ఉపయోగిస్తాం. ఎందుకంటే తేనెలో రుచి అంత ఉంటుంది. ఔషధ గుణాలు  కూడా ఎక్కువ.. ఇంకా ఆ తేనే ఉపయోగించడం వల్ల లాభాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ సమస్యలు ఉన్న వాళ్ళు గోరు వెచ్చటి నీరులో కొంచం తేనే, మిరియాల పొడి వేసి తాగితే జలుబు, దగ్గు తగ్గిపోతుంది.. 

 

కొత్తగా తీసిన తేన తీసుకుంటే శ్లేషం తగ్గుతుంది.. అలాగే పాత తేనే తీసుకుంటే మలబద్దకం ఉండదు.. తేనే ఎంత పాతగా అయితే అంత ఆరోగ్యం. 

 

ఆయాసం, దగ్గు, కాఫామ్ తో బాధపడేవారు అరా చెంచా తేనే వేడి నీళ్లలో వేసుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.. ఇలా రోజుకు మూడు లేదా నాలుగు సార్లు తీసుకునే మంచిది. 

 

అజీర్ణం వల్ల కడుపు నొప్పి వచ్చినప్పుడు అరకప్పు వేడి నీటిలో రెండు చెంచాల తేనే వేయించిన వాము చెంచా తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. 

 

గోరు వెచ్చటి నీళ్లలో అరా చెంచా తేనే వేసుకొని పుక్కలిస్తే గొంతు నొప్పి, చిగుళ్ల వాపు యిట్టె తగ్గిపోతుంది. 

 

కాఫి, టీలకు బదులుగా తాగే గ్రీన్ టీలో కొద్దిగా తేనే వేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

 

తేనే తరచూ తీసుకుంటే చర్మ వ్యాధులు కూడా రావు. 

 

బాగా నిద్ర పట్టాలి అంటే పాలల్లో పంచదారకు బదులుగా తేనే వేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది.. రాత్రి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. 

 

బరువు తగ్గించే పదార్ధాలతో కలిపి వాడితే బరువు పెరుగుతారు.. అలానే తగ్గించే పదార్ధాలతో కలిపి వాడితే తగ్గుతారు.. 

 

అంతేకాదు తేనేను ఎప్పుడు కూడా నేరుగా వేడి చెయ్యకూడదు .. తేనే గట్టి పడితే వేడినీళ్లలో పెట్టాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: