క‌రోనాతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అత‌లాకుత‌లం అవుతున్న వేళ‌..ఉరుములేని పిడుగులా  విశాఖ‌లో పీవీసీ గ్యాస్ లీకేజితో ఇప్పుడు అక్కడి జ‌నం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో లీకైన వాయువు.. స్టైరిన్గా గుర్తించారు. ఇది రసాయన ఫార్ములా C8H8 స‌మ్మేళ‌నం. ఈ ర‌సాయ‌నానికి గాలిలో తొంద‌ర‌గా క‌లిసిపోయే గుణం ఉంటుంది. ఎక్కువ‌గా వ్యాప్తి చెంద‌డానికి ఈ గుణం దోహ‌దం చేస్తోంది. ఇప్పుడు అధికారుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్న విష‌యం కూడా ఇదే. ఎంత ఎక్కువ‌గా వ్యాప్తి చెందితే అంత ప్ర‌మాద‌మూ పెరుగుతుంది, బాధితుల సంఖ్య పెరుగుతుంది. దీని ప్ర‌భావం దాదాపు 48గంట‌ల‌కు వ‌ర‌కు ఉంటుంది. 

 


ఈ వాయువు తీవ్ర దుష్ప్ర‌భావాని చూపుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. చర్మానికి తగిలినా, కంటికి తగిలినా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంద‌ని వెల్ల‌డిస్తున్నారు. కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధులకు గురి చేస్తుంది. ఇది పీల్చుకున్న వెంట‌నే ముందు మెద‌డుపై ప్ర‌భావం చూప‌టంతో చాలామంది అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోతు న్న‌ట్లుగా ఇప్ప‌టి విశాఖ సంఘ‌ట‌న‌లో గుర్తించారు. అంతేకాక శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిప‌డుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యాల్లోనే బాధితుల‌కు ఆక్సిజ‌న్ ఎక్కువ‌గా అందేలా చేస్తే ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌వ‌చ్చ‌ని వైద్యులు సూచిస్తున్నారు. స్టైరిన్ గ్యాస్ను పీల్చడం వల్ల తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్లు మంటలు వంటివి ప్రథమంగా కనిపిస్తాయి. 

 


ఒకవేళ ఎవరైనా ఈ గ్యాస్ అధిక మోతాదులో పీలిస్తే క్యాన్సర్, కిడ్నీ సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండ‌గా  స్టైరిన్ కాఫీ బీన్స్, పీనట్స్, కోల్ థార్ వంటి వాటిలో ఇది ఉంటుంది. 1839లో జర్మనీకి చెందిన ఎడ్వర్డ్ సైమన్ తొలిసారిగా స్టైరిన్‌ను గుర్తించారు. గాలి, కాంతి, వేడికి ఉంచినపుడు మెల్లిమెల్లిగా గట్టిగా, రబ్బరులా రూపాంతరం చెందుతుంది. దీన్ని రబ్బరు సంబంధిత పరిశ్రమల్లో వాడతారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ కూడా వాడుతోంది. అయితే ప్ర‌మాద‌వ‌శాత్తు విశాఖ ప‌రిశ్ర‌మ‌లో గ్యాస్ లీక్ కావ‌డంతో ఆర్ ఆర్ వెంకటాపురంలో ముగ్గురు, విశాఖ కేజీహెచ్‌లో ఐదుగురు ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు, అధికారులు చెబుతున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: