ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర సొంత రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతూ పోతున్న వేళ‌..మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది. అదేమంటే దేశంలోనే ప్ర‌ముఖ ఫార్మా కంపెనీల్లో ఒక‌టైన క్యాడిలా ఫార్మా సంస్థలో దాదాపు 26మందికి కొవిడ్‌-19 నిర్ధారణ కావ‌డం గ‌మ‌నార్హం. ఏడు రోజుల క్రితం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. తాజాగా ఈ ఒక్కవారంలోనే మ‌రో 21మంది క‌రోనా బారిన‌ప‌డ్డ‌ట్లుగా ప‌రీక్ష‌ల్లో తేలింది. దీంతో గ‌డిచిన వారం రోజుల్లోనే ఈ  సంస్థలో  వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 26కు చేరడంతో కంపెనీని తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 


ఈ సంఘ‌ట‌న ఇప్పుడు ఫార్మా ప‌రిశ్ర‌మ‌లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే అనేక జాగ్ర‌త్త‌ల మ‌ధ్య సిబ్బంది ప‌నిచేస్తున్నారు. కొంత‌మంది అయితే ఇంటికి వెళ్ల‌కుండా ప్ర‌త్యేకంగా హోట‌ళ్ల‌లో బ‌స చేస్తూ విధుల‌కు హాజ‌ర‌వుతున్నారు. ఏ ఒక్క‌రికి క‌రోనా వైర‌స్ వ‌చ్చినా మొత్తానికి  మోసం వ‌స్తుంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు భ‌య‌ప‌డుతూ వ‌స్తున్నాయి. ఇంత‌లో క్యాండి సంస్థ‌లో క‌రోనా బారిన సిబ్బంది ప‌డ‌టంతో ఇప్పుడు పరిశ్ర‌మ వ‌ర్గాలు ఉలిక్కిప‌డుతున్నాయి.  సంస్థలో పనిచేసే మరో 95మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు గుజరాత్ వైద్య ఆరోగ్య‌శాఖ  అధికారులు తెలిపారు.


 ప్ర‌స్తుతం సంస్థ‌లో కార్యకలాపాలుర పూర్తిగా నిలిపివేసిన‌ట్లుగా యాజమాన్యం కూడా ప్రకటించింది. ఇదిలా ఉండ‌గా గుజరాత్‌లో  ఇప్పటివరకు  7012పాజిటివ్‌ కేసులు నమోద‌య్యాయి. 425మంది మృత్యువాతపడ్డారు. గుజరాత్‌లో కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గుజరాత్‌లో ఇప్పటివరకూ 368 మంది కరోనా వల్ల మరణించారు. గురువారం ఒక్కరోజే ఒక్క అహ్మదాబాద్‌లోని 349 కరోనా పాజిటివ్ కేసులు, 39 కరోనా మరణాలు నమోదు కావడం గమనార్హం.  ప్ర‌ధాన‌మంత్రి మోదీ, అమిత్‌షా కూడా ఎప్ప‌టిక‌ప్పుడు రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌పై ఆరా తీస్తుండ‌టం గ‌మనార్హం.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: