తెలంగాణలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుతుండ‌టంపై రాజ‌కీయ ప‌క్షాలు ఇప్ప‌టికే ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యంలో హైకోర్టు కూడా సీరియ‌స్‌గా కావ‌డంతో ఈ విష‌యానికి ప్రాధాన్యం నెల‌కొంది. వాస్త‌వానికి కొద్దిరోజులుగా తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌భుత్వం ఉద్దేశం పూర్వ‌కంగా ప‌రీక్ష‌లు నిలిపివేయ‌డం, ల‌క్ష‌ణాలు క‌న‌బ‌డిన వారికే ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వంటి నియ‌మాలు పెట్టుకోవ‌డంతో కేసులు త‌క్కువ సంఖ్య‌లో వెలుగులోకి వ‌స్తున్నాయ‌న్న అనుమానాల‌ను చాలామంది వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నారు.


 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్కువ‌గా కేసులు న‌మోద‌వుతుండ‌టానికి అక్క‌డ ప‌రీక్ష‌లు ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌ట‌మేన‌ని గుర్తు చేస్తున్నారు. మృతులకు కరోనా పరీక్షలు చేయడం లేదని.. అంతేకాదు తక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం వల్లే కేసుల సంఖ్య తగ్గిందని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు సైతం కరోనా పరీక్షలపై అసంతృప్తి వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కరోనా పరీక్షల వివ‌రాలను..తీరును దాస్తోంద‌ని విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు స్వీక‌రించింది. శుక్ర‌వారం జ‌రిగిన ఈ విచార‌ణ‌లో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి  హైకోర్టు  పలు ప్రశ్నల‌ను సంధించింది.

 

అసలు మృతదేహాలకు కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదో చెప్పాల‌ని ఏజీని ప్రశ్నించింది. క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఎందుకు నిర్ణ‌యం తీసుకున్నారు అంటూ మండిప‌డింది. డ‌బ్ల్యూహెచ్‌వో మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కార‌మే రాష్ట్రంలో క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌భుత్వాన్ని ఏజీ స‌మ‌ర్థించ‌బోయినా.. హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  లక్షణాలు ఉన్న వారికే పరీక్షలు చేయాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో  మార్గదర్శకాల్లో ఎక్కడుందో చూపించాలని ప్రశ్నించ‌డం గ‌మ‌నార్హం. గజిబిజి లెక్కలతో ప్రజలకు వాస్తవాలు తెలియవ‌ని పేర్కొంది. పూర్తి వివ‌రాల‌తో రావాల‌ని తదుపరి విచారణను మే 14కి వాయిదా వేసింది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: