దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్లో క‌రోనా పాజిటివ్ కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ను క‌రోనా నెమ్మదిగా కబళిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 3వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ దాదాపు 150కు పైగా కేసులు కొత్తగా నమోదవుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో 155 కరోనా కేసులు నమోదయ్యా యి. వీటితో కలుపుకొని మొత్తం కేసులు 3,214కు చేరాయని వైద్య ఆరోగ్య‌శాఖ హెల్త్‌బులిటెన్‌లో పేర్కొంది. వీరిలో 66 మంది ప్రాణాలు కోల్పోయారని, 1,387 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.

 

ఇంకా 1,761 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించింది. వాస్త‌వానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. ఐదు రోజుల క్రితం యూపీలో 2,579 కరోనా కేసులు ఉండ‌గా రోజుకు 150 కేసులు న‌మోదు కాగా శుక్ర‌వారం నాటికి  3,214కు నమోదయ్యాయి. ఇదిలా ఉండ‌గా వివిధ రాష్ట్రాల్లో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ కూలీలు ల‌క్ష‌లాది మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు స్వ‌రాష్ట్రానికి చేరుతుండ‌టంతో క‌రోనా ప్ర‌భావం పెరిగే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కార్మికుల‌ను అడ్డుకుంటున్నా..ఎంత‌మాత్రం ఫ‌లితం లేకుండాపోతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

 

కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విష‌యంలో స‌డ‌లింపులు ఇచ్చిన మూడురోజుల‌కే యూపీలో 28మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఆ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో ఈ ఘటన వెలుగుచూడ‌టం గ‌మ‌నార్హం. ఆగ్రాలోని  పదిరోజుల వ్యవధిలో 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది.ఈ వ్యాపారులకు కరోనా వైరస్.. ఎలా సోకిందన్న దానిని గుర్తించేందుకు పోలీసులు, పలువురు వైద్యాధికారులు రంగంలోకి దిగారు. ఈ ప్రాంతాల్లో మొత్తం 160 మంది వీధి వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణాల వ్యాపారులకు కరోనా టెస్టులు చేయగా.. వారిలో 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ తేలిందని ఆగ్రా ఎస్పీ తెలిపారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన కూరగాయల వ్యాపారులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: