జలుబు మరియు దగ్గు మన జీవితంలో సాధారణ ఆరోగ్య సమస్యలే అయిన‌ప్ప‌టికీ.. ఇవి వ‌చ్చాయంటే ఓ ప‌ట్టాన పోవు. వాస్త‌వానికి ఈ దగ్గు, జలుబు అనేవి.. మన బాడీలో చాలా రుగ్మతలకు అవకాశం కల్పిస్తాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఇలా వన్ బై వన్ అన్నీ వచ్చేలా చేస్తాయి. అయితే ఇలాంటి టైమ్‌లో ఆస్పత్రుల దొరికే మందుల కంటే ఇంట్లో తయారు చేసే రెమిడీస్ బాగా పనిచేస్తాయి. మ‌రి ఆ అద్భుత‌మైన రెమిడీస్ ఏంటి..? అవి ఎలా యూజ్ చేయాలి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

 

అందులో ముందుగా.. అల్లం రసంలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కొంచెం నిమ్మరసం మూడు బాగా కలుపుకొని తీసుకోవడం వల్ల జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ మిశ్రమం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వేడి పాలల్లో కాసింత పసుపు కలిపుకుని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళల్లో బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. పసుపులోని యాంటీ బయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనెలో సగం టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి పడుకునేటప్పుడు తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

 

అదేవిధంగా, జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు తులసి ఆకులు తీసుకొని వాటిని నీటిలో బాగా మరిగించాలి. అది గోరువెచ్చగా అయ్యాక తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కఫాన్ని తగ్గిస్తుంది. అలాగే దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. మ‌రియు నీటిని నోటిలో పోసుకొని  ఓ రెండు నిమిషాలు పుక్కిలించి బయట పారేయాలి. ఇలా ఒకట్రెండుసార్లు చేస్తే... గొంతులో రిలీఫ్ లభిస్తుంది. అయితే ఇలా రోజుకు రెండుసార్లైనా చెయ్యాలి. ఇక గోరువెచ్చటి నీటిలో ఉప్పు లేదా పసుపు వేసుకొని పుక్కిలిస్తే గొంతులో మంట, గరగర వంటివి తాత్కాలికంగా తగ్గుతాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: