వ‌లస కార్మికుల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్ల‌లో పూర్తి సామార్థ్యంతో న‌డుస్తాయ‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో ఒక్క శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌లో ఇప్పటి వరకు 1,200 మంది ప్యాసింజర్లను చేరవేయగా.. ఇప్పుడు ఈ సంఖ్య అటూఇటుగా 1,600లకు పెరగనుంది. వాస్త‌వానికి ఇన్నాళ్లు స్లీపర్ కోచ్‌లోని మధ్య బెర్త్‌ను సామాజిక దూరాన్ని పాటించాల‌నే ఉద్దేశంతో కేటాయించలేదు. అయితే ఇక‌పై  మధ్య బెర్త్‌ను కూడా వలస కార్మికుల త‌ర‌లింపున‌కు వినియోగ‌నించ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా ఇప్పటివ‌ర‌కు  వలస కార్మికుల స్వరాష్ట్రంలో మూడు స్టాప్‌‌లు ఉంటాయని రైల్వేస్ వెల్లడించింది.


 గతంలో కేవలం ఒకే ఒక‌ స్టాప్ ఉండేది. అయితే సుదూర ప్రాంతాల‌కు రోడ్డు మార్గాన స్వ‌స్థ‌లాల‌కు చేరుకోవ‌డంలో కార్మికులు ఇబ్బందులు ప‌డుతున్న నేప‌థ్యంలో రైల్వే ఈ నిర్ణ‌యం తీసుకుంది. మే 12 నుంచి దశలవారీగా ప్యాసింజర్ రైళ్లు అందుబాటులో ఉంటాయని.. మంగళవారం నుంచి కొన్ని రూట్లలో ప్రయాణికుల కోసం రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ రైళ్లను ప్రత్యేక సర్వీసులుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.  ఐఆర్‌సీటీసీలో సాయంత్రం 4 గంటలకు రైల్వే టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించడంతో సోమ‌వారం వెబ్‌సైట్‌కు విప‌రీతంగా తాకిడి మొద‌లైంది. 


సైట్ నెమ్మదించింది. టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయాణికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే  చివ‌రకు విష‌యం గ‌మ‌నించిన రైల్వే శాఖ ఈ అసౌకర్యంపై వివరణ ఇచ్చింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ క్రాష్ కాలేదని, రైళ్ల రాకపోకలకు సంబంధించిన డేటాను అప్‌లోడ్ చేస్తున్న‌ట్లు తెలిపింది. సోమ‌వారం సాయంత్రం 6 గంటల నుంచి టికెట్ బుకింగ్ సేవలను తిరిగి అందుబాటులోకి తెస్తామని ఐఆర్‌సీటీసీప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా  మంగళవారం ఢిల్లీ నుంచి 15 నగరాలకు రైళ్లను నడపనున్నారు. అదే సమయంలో ఈ నగరాల నుంచి కూడా ఢిల్లీకి రాకపోకలు సాగుతాయి. ఈ నగరాల జాబితాలో సికింద్రాబాద్‌ కూడా ఉండ‌టం విశేషం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: