స్కిన్ ఎలెర్జీలు.. నేటి కాలంలో ఈ స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు.  స్కిన్ అలెర్జీ యొక్క సాధారణ లక్షణాలలో ఎరుపుదనం, దురద మరియు వాపు ఇలా ఉంటాయి. వాస్త‌వానికి మన చుట్టూ ఎన్నోరకాల సూక్ష్మజీవులున్నాయి. ఈ సూక్ష్మ పదార్ధాలు, రసాయనాలు, పుప్పొడిరేణువులు, ధూలి, దుమ్మి వంటివి.. గాలి, నీరు, బట్టలు, ఆహారపదార్ధములు ద్వారా వచ్చి మనకు చేరుతాయి. వీటన్నిటిమీద తగిన చర్య చూపుతూ శరీరము, వ్యాధినిరోధక వ్యవస్థ తనను తాను రక్షించుకుంటుంది. అయితే వీటిలో కొన్నింటిమీద కొందరి శరీరాలు చూపే ప్రతిచర్యలు తీవ్రముగా ఉంటాయి. అదే స్కిన్ ఎలర్జీ. అలాగే ఒక్కోసారి దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల స్కిన్ ఎలెర్జీలు వ‌స్తుంటాయి.

 

అయితే ఇలాంటి ఎలెర్జీల‌కు ఇంటి చిట్కాల‌తోనే చెక్ పెట్ట‌వ‌చ్చు. అందులో ముందుగా,  అరటి తొక్కతో మీకు ఎలెర్జీ ఉన్న‌ ప్రాంతంలో రుద్దండి. తొక్కలో ఉన్న స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అలెర్జీ సమస్యలను దూరం చేస్తాయి. ఇలా చేయడం వల్ల దద్దుర్ల సైజ్, మంట, వాపు, నొప్పి వంటి సమస్యలు దూరం అవ్వడమే కాకుండా ఆ ప్రాంతం కూల్‌గా మారుతుంది. అలాగే ఎలర్జీల ద్వారా కలిగే దురదలు నశించే విధంగా ఆపిల్ సైడర్ వెనిగర్ పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ని ఆహారంలో భాగం చేసుకోవాలి. 

 

మ‌రియు దీన్ని నీళ్ళలో కలిపి ఎలర్జీ వచ్చిన ప్రాంతం లో ఈ వెనిగర్ రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ కి బాక్టీరియా నుండి ఉపశమనం కలిగించే లక్షణం పుష్క‌లంగా ఉంది. అదేవిధంగా, అరటి తొక్కపై కాస్తా గ్లిజరిన్ రాసి ఆ తొక్కతో సమస్య ఉన్న ప్రాంతంలో సున్నితంగా మర్దనా చేయండి. ఇలా చేస్తుంటే క్రమంగా సమస్య తగ్గుతుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇక ఎలర్జీలకి విరుగుడుగా గ్రీన్ టీ పనిచేస్తుంది. రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఎలర్జీల సమస్య నుండి ర‌క్షించుకోవ‌చ్చు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: