క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల విష‌యంలో చైనాను భార‌త్ అధిగ‌మించ‌నున్నది. చైనా త‌ర్వాత అత్య‌ధిక జ‌న సాంద్ర‌త క‌లిగిన భార‌త్‌లో వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న విష‌యం తెలిసిందే. వైర‌స్ క‌ట్ట‌డిలో మొద‌టి 25రోజులు మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్టిన దేశం  ఆ త‌ర్వాత మాత్రం క్ర‌మంగా క‌రోనా కబంధ హ‌స్తాల్లోకి వెళ్లిపోయింది. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఇటీవ‌ల నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోద‌వు తున్నాయి. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌లో అయితే పాజిటివ్ కేసుల సంఖ్య‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం.

 

గ‌డిచిన 10రోజుల్లోనే దేశంలో కరోనా వైరస్ కేసులు రెట్టింపు కావడం గ‌మ‌నార్హం. గడచిన రెండు వారాల్లో పాజిటివ్ కేసుల రోజుకు సగటు 3,000పైగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 75వేల‌కు పైగా న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే మూడు రోజులతో పోల్చితే మంగళవారం పాజిటివ్ కేసులు తక్కువ‌గా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో మరో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,415కు చేరింది. దేశంలో కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో  ఉంది. ఈ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,000కిపైగా పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ కావ‌డం గ‌మ‌నార్హం.  

 

అలాగే మొత్తం బాధితుల సంఖ్య 24,427కి చేరింది. ఒక్క పుణె మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే సుమారు 2,700 కేసులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 161 మంది ప్రజలు కరోనా కాటుకు బలయ్యారు. ఇదిలా ఉండ‌గా పాజిటివ్ కేసుల్లో చైనా తర్వాతి స్థానానికి భారత్ చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన   దేశాల జాబితాలో చైనా 11వ స్థానంలో ఉండగా.. భారత్ దీని తర్వాతి స్థానంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. బుధవారం ఉదయానికి భారత్‌లో కేసులు 75,000కి చేరాయి. చైనాలో 82,900 దాటేశాయి. అయితే చైనాలో ఉధృతి లేక‌పోవ‌డం..భార‌త్‌లో తారస్థాయికి చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఒక‌ట్రెండు రోజుల్లోనే చైనాను భార‌త్ అధిగ‌మించ‌నుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: