నేటి స‌మాజంలో మారిన వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లతో స్త్రీ, పురుషులు అధిక బ‌రువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో మనిషి నాజుకైన శరీరానికి దూరమౌతున్నారు. ముఖ్యంగా ఆడ‌వారు నాజుకైన న‌డుమును కోల్పోతున్నారు. నడము వైపుకు రెండు పక్కలా కొవ్వు పేరుకుపోయి లావుగా ఉంటే.. చూసే వారికే కాదు.. మనకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. వాస్త‌వానికి ఆడవారికి అందం ఎంత ముఖ్యమో... నాజుకైన నడుము కూడా అంతే ముఖ్యం అని చెబుతుంటారు. అస‌లు ఆడవారి నడుము అందానికే కేరాఫ్ అడ్రస్.

 

ఓ రకంగా చెప్పాలంటే ఆడవారి అందాన్ని అంచనా వేయాలంటే అందులో నడుము అగ్రస్థానంలో ఉంటుంది. ఇక నాజుకైన న‌డుము కోసం స్త్రీలు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఆహారం మాసేని క‌డుపును కాల్చ‌కుంటారు. కానీ, వీటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అందుకే ఇప్పుడు చెప్పుబోయే హెల్తీ టిప్స్ ఫాలో అయితే నాజుకైన న‌డుము మీ సొంతం. ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అంతేకాదు ఆడవారి శరీర ఉష్ణోగ్రతను పెంచి కొవ్వును కరిగిస్తుంది. ముఖ్యంగా మీ న‌డుపు చుట్టూ ఉన్న అధిక కొవ్వును త‌గ్గిస్తుంది.

 

అలాగే జీలకర్ర కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుతంది. జీల‌క‌ర్ర‌లో కూడా అదనపు కొవ్వుని తగ్గించే గుణం ఉంది. అందుకే ప్రతిరోజూ ఓ టీస్పూన్ పరిమాణంలో జీరాని ఓ గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతుండాలి. ఇలా చేస్తుంటే ఒంట్లోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మ‌రియు న‌డుమును నాజుకుగా చేస్తుంది. అదేవిధంగా, బాదం పప్పును ప్రతిరోజూ తింటే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. అంతేకాదు మీ శరీర బరువును చాలా మేరకు తగ్గిస్తుంది. బాదంలోని ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్ శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ ని కరిగిస్తాయి. నాజుకైన నడుము పొందాలంటే ఆహారపు అలవాట్లతో పాటు వ్యాయామం తప్పనిసరి. 

 
 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: