మనలో చాలా వరకు ఉదయాన్నే నిద్ర లేవాలని అనుకుంటారు. అలాగే నిద్రపోయే ముందు అలారం పెట్టుకుని అది మోగే టయానికి దాన్ని కట్టేసి పక్కన పెట్టేస్తారు. చాలా వరకు ఇలానే జరుగుతూ ఉంటుంది. మామూలుగా చూస్తే ఉదయాన్నే నిద్ర లేచిన వాళ్ళు కష్టపడిన వాళ్లు జీవితంలో చాలా వరకూ పైకి వచ్చారు అని చరిత్ర చెబుతోంది. అంతే కాకుండా ప్రపంచంలో అతి పెద్ద విజయం బ్లాంకెట్ విజయం అని కూడా అంటారు. ఎప్పుడైతే పడకపై దుప్పటి పై నిద్ర పై విజయం సాధించడం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా జీవితంలో చాలావరకు విజయాలను సాధిస్తారని అటువంటి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటారని చాలామంది మేధావులు అంటారు.

 

మరి ఇటువంటి సమయంలో ప్రస్తుత మన జీవన శైలి బట్టి నిద్ర లేవాలి అంటే కొన్ని చిట్కాలు మీ కోసం. మామూలుగా అయితే నిద్ర ఉదయాన్నే లేవడం వల్ల చాలా వరకు టైం లభిస్తుంది అలాగే కోపం, విసుగు, ఒత్తిడి దూరమవుతాయి. అయితే ప్రారంభంలో ఇబ్బందిగా ఉండే ఈ నిద్రలేవడాన్ని అలవాటు చేసుకోవాలనువాళ్ల కోసం కొన్ని చిట్కాలు పాటించండి. తప్పకుండా మీకు ఉదయాన్నే నిద్రలేవడం అలవాటవుతుంది. ఉదయించే సూర్యున్ని వీక్షించడమనే ఆనందాన్ని కూడా హద్దులేకుండా పొందొచ్చు. అయితే ఈ విషయంలో ఒక్కసారిగా దినచర్య మారిపోకుండా మెల్ల మెల్లగా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ 6.30 కో, ఏడింటికో లేస్తున్నారనుకోండి. వెంటనే దాన్ని 4.30కి మార్చకండి. మెల్లమెల్లగా అలవాటు చేయాలి. ఓ అరగంటో, పావుగంటో వెనక్కి జరపండి.

 

ఇలా కొన్ని రోజులు చేసాక, మీకు ఇబ్బందిగా అనిపించడం ఆగిపోతుంది. అప్పుడు మరో అరగంట వెనక్కి జరగండి. మళ్లీ కొన్ని రోజలు అలా… ఎక్కడికయితే రావాలనుకున్నారో ( 4.30 లేదా 5.00) వచ్చాక, ఇక దాన్ని కొనసాగించండి. ఏదైనా కొత్త విషయం అలవాటు కావాలంటే కొంత సమయం అవసరం. చాలావరకు అలారాన్ని దూరంగా పెట్టండి. ఇదే సమయంలో ముందుగా త్వరగా నిద్రపోండి. వీలైనంత వరకు నిద్ర లేచిన తర్వాత పడక గది నుండి బయటకు రావడానికి ట్రై చేయండి. ఆ తర్వాత సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ మీ పనులు స్టార్ట్ చేస్తే ఇంకా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో త్వరగా నిద్రలేచే అవకాశం ఈజీగా అలవాటవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: