దాదాపు ఈ అనుభవం ఉన్న చాలామంది వెళ్లి ఉంటారు. అదేమిటంటే గాఢంగా నిద్ర పట్టిన సమయంలో ఒక్కసారిగా గుండెలపై ఎవరో కూర్చున్నట్లు, గొంతు పిసుకుతూ ఉన్నట్లు, అదేవిధంగా గట్టిగా అరిచినా గాని పక్కన వారికి వినబడక పోతున్నట్లు ఇటువంటి అనుభవం ఉన్న చాలామంది వెళ్లి ఉంటారు. దీంతో తెల్లవారేసరికి దెయ్యం మీద పడింది గట్టిగా అరిచాను నువ్వు లెగ లేదు ఎంతో గించుకునే సరికి అది నన్ను వదిలి వెళ్ళింది అని మాట్లాడుకుంటారు. అయితే ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు స్లీపింగ్ పెరాలసిస్ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మంది ప్రజలకు ఇలాంటి అనుభవం ఎదురవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

 

మెదడులో నిర్ధేశిత ప్రాంతంలో చోటుచేసుకునే ‘కల్లోలం’ దెయ్యాలు, రాక్షసుల రూపంలో నిద్రలో కనిపిస్తుందని వారు తెలిపారు. దీనినే మనం దెయ్యంగా భావించి భయపడతామని వారు స్పష్టం చేశారు. నిద్రిస్తున్న స‌మ‌యంలో ఒక్క కండరాన్ని కూడా కదల్చలేని పరిస్థితిలో, ఏదో ఉనికి గదిలో స్పష్టం అవుతూ ఉండగా, మ‌న‌ ఛాతి మీద కూర్చుని ఊపిరిని నొక్కేస్తూ ఉండ‌డమే 'స్లీపింగ్ పెరాలసిస్' అంటారు. అంతే కాకుండా మంచి నిద్రలో ఉన్న టైంలో పిలిస్తే ఒక్కసారి పిలిస్తే వెంటనే లేచి కూర్చుంటారు కూడా, అంతేకాకుండా ఒక్కోసారి ఉలిక్కిపడి లేచి మరి భయపడతారు.

 

కానీ కొంతమంది మాత్రం ఎంత పిలిచినా ఉలకరు పలకరు. మెలకువ వచ్చినా లేవలేరు కూడా. దీనినే ఆధునిక వైద్యం 'స్లీప్ పెరాలసిస్' అని స్ప‌ష్టం చేసింది. నిద్ర సమయంలో మెదడు శరీరం ఒక చోట లేనప్పుడు 'స్లీపింగ్ పెరాలసిస్' చోటు చేసుకుంటుందట. ఇటువంటి పరిస్థితి వల్ల మనుషులకు రకరకాల బ్రమలు కలుగుతాయని దానివల్ల ఎలాంటి హానికరం ఉండదని శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: