క‌రోనాకు పుట్టినిల్లుగా ప్ర‌చారంలో ఉన్న చైనా దేశంలో మ‌ళ్లీ వైర‌స్ ఉధృతి పెరుగుతోంది. గ‌డిచిన కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. ఈక్ర‌మంలోనే వూహాన్ న‌గ‌రంలోని దాదాపు కోటిమందికి పైగా జ‌నాభాకు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని చైనా ప్ర‌భుత్వం ఇటీవ‌ల సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈక్ర‌మంలోనే దాదాపు ఏర్పాట్లు కూడా పూర్తి కావ‌డం గ‌మ‌నార్హం. అయితే చైనా ప్ర‌జ‌ల‌పై క‌రోనా వైర‌స్ చూపుతున్న ప్ర‌భావంపై అధ్య‌యనం చేస్తున్న శాస్త్ర‌వేత్త‌ల‌కు ఓ కొత్త విష‌యం అవ‌గత‌మైందంట‌. అదేమంటే వాస్త‌వానికి ఇప్పుడు క‌రోనా వైర‌స్ అడుగిడ‌ని దేశం లేదు. చాలా దేశాలు ఈ వైర‌స్ ప్ర‌భావంతో అత‌లాకుత‌లం అవుతున్న విష‌యం తెలిసిందే. 


దాదాపు రెండు నుంచి మూడు మాసాలుగా క‌రోనాతో పోరాటం చేస్తున్నాయి. క‌రోనా కార‌ణంగా ఇట‌లీ, బ్రిట‌న్‌, అమెరికా, భార‌త్ వంటి దేశాల్లో మిక్కిలిగా ప్రాణ‌న‌ష్టం సంభ‌వించింది. మొదట్లో చైనాలోనూ ప్రాణ‌న‌ష్టం అధికంగానే జ‌రిగినా ఆ దేశం త్వ‌రగానే ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ప్రారంభ‌మ‌వుతుండ‌టం వారిలో ఆందోళ‌న‌క‌లిగిస్తోంది. చైనా దేశ‌స్తుల్లో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్లే క‌రోనా కేసులు పెరుగుతున్న‌ట్లు తెలుస్తోంది.కాగా.. కోవిద్-19 మహమ్మారిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చైనీయుల్లో లేని కారణంగా చైనాకు ఈ వైరస్‌ ముప్పు మరోసారి పొంచివుందని తాజాగా చైనా ప్రభుత్వ సీనియర్‌ ఆరోగ్య సలహాదారుడు డా.జోంగ్‌ నాన్‌షాన్‌ వెల్లడించారు. 


కొన్ని వారాలుగా వుహాన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా కేసులు బయటపడుతున్నాయి, తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా చైనీయులు కోవిద్-19 బారినపడే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. వైరస్‌కు కేంద్ర బిందువైన చైనాలో వైరస్‌ తగ్గుముఖం పట్టిందని అక్కడి ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ, గతకొన్ని రోజులుగా అక్కడ మళ్లీ పాజిటివ్ కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలో కరోనా మహమ్మారి నుంచి చైనా ఇంకా బయటపడలేదని అక్కడి నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: