కొద్దిరోజుల క్రితం వ‌ర‌కు కూడా పెద్ద‌గా క‌రోనా ప్ర‌భావం క‌న‌బ‌డ‌ని చ‌త్తీస్‌గ‌డ్‌లో గ‌డిచిన వారం రోజులుగా క్ర‌మంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం  క‌ర్ఫ్యూను మ‌రో మూడు నెల‌ల వ‌ర‌కు పెంచుతూ  నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే ఒక్క‌సారిగా మూడు నెల‌ల పాటు క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంద‌ని తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. లాక్‌డౌన్ విష‌యంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అవ‌లంభిస్తున్న విష‌యం తెలిసిందే. వారికి స్థానికంగా కేసుల న‌మోదు..ఇత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ లాక్‌డౌన్‌పై ఆంక్ష‌ల‌ను కొన‌సాగిస్తున్నాయి. ఇక గ్రీన్ జోన్ల‌లో దాదాపు చాలా వ‌ర‌కు ఆంక్ష‌లు స‌డ‌లించి సాధార‌ణ ప‌రిస్థితుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. 


ఈక్ర‌మంలోనే చ‌త్తీస్‌గ‌డ్‌లో ప‌రిస్థితిని అంచ‌నా వేసిన అక్క‌డి ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విష‌యంలో స‌డ‌లింపులు ఇచ్చినా రాత్రివేళ‌ల్లో మాత్రం క‌ర్ఫ్యూను మ‌రో మూడు నెల‌ల పాటు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.   చాలా ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఒక్కసారిగా పెరగొచ్చని కలెక్టరలందరు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ప్రభుత్వం పేర్కొంది. ఆదివారం నాడు 25 కొత్త కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 92కు చేరుకుంది. 32 మంది చికిత్స పొందుతుండగా.. 59 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్న‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు ప్ర‌క‌టించారు.


కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కాగా.. ఛత్తీస్‌గఢ్ లో మరో మూడు నెలలపాటు కర్ఫ్యూ పొడిగించారు. ఇదిలా ఉండ‌గా ప్రపంచ వ్యాప్తంగా క‌రోనా వేగంగా విస్త‌రిస్తూనే ఉంది. అటు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మృతుల సంఖ్య ల‌క్ష వ‌ర‌కు ఉండ‌టం గ‌మ‌నార్హం. క‌రోనా కేసులు ల‌క్ష దాటిన దేశాల్లో స్పెయిన్‌, ఇటలీ, లండన్, జర్మనీ., రష్మా, ఫ్రాన్స్, ఫ్రాన్స్‌, టర్కీ, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష‌కు అత్యంత చేరువ‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: