క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన అధ్య‌య‌నాల్లో ఆశ్చ‌ర్య‌క‌ర‌, భ‌యాందోళ‌న‌లు క‌లిగించే విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మ‌హ‌మ్మారి సైలెంట్ మోడ్‌లో ఉండి మాన‌వ‌దేహ‌న్ని ప్రాణాంత‌క స్థితికి చేర్చుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ వైర‌స్ సోకిన‌ట్లుగా క‌నుగోన‌డ‌మే చాలా క‌ష్ట‌త‌రంగా మారిన విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ్యాధి సోకింద‌ని తెలుసుకోవ‌డానికి వైద్యులు ప్రాథ‌మిక ల‌క్ష‌ణాలుగా  దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైనవాటిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు.  

 

అయితే ఇప్పుడు క‌రోనాను గుర్తించ‌డానికి  కండరాల నొప్పి, రుచి, వాసన శక్తిని కోల్పోవడం మొదలైన వాటిని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వంటి ల‌క్ష‌ణాల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నారు. చలితో వణకడం, గొంతు నొప్పి మొదలైనవి కూడా కరోనా లక్షణాలని పేర్కొంటోంది. క‌రోనా బారిన పడిన 2 నుంచి 14 రోజుల మధ్య ఈ లక్షణాలు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. ఇలాంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారిలో క‌రోనా పాజిటివ్ వ‌స్తుండ‌టమే ఇందుకు ప్రధాన కార‌ణం. అయితే ఎలా సోకుతోంద‌న్న‌ది మాత్రం ఇంకా తెలియ‌రావ‌డం లేదని వైద్యులు చెబుతున్నారు.


 ఇదిలా ఉండ‌గా ఇంకో భ‌యాన‌క‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమంటే విశాఖ‌ప‌ట్నం ప‌ట్ట‌ణంలోని ఓ కుటుంబ స‌భ్యుల‌కు ఏకంగా  18 నెలల చిన్నారిని సహా అందరినీ వైరస్‌ చుట్టబెట్టేసింది. ఇందులో 30 ఏళ్ల వ్యక్తికి రెండుసార్లు కొవిడ్‌ బారినపడటం గ‌మ‌నార్హం.  ఒకే వ్య‌క్తికి కోలుకున్నాడ‌ని వైద్యులు ధ్రువీక‌రించాక మ‌ళ్లీ క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించిన తొలికేసుగా చెప్ప‌వ‌చ్చు. ఈ త‌ర‌హా కేసులు ఇండియాలో న‌మోద‌వ‌డం కూడా అంకెల్లో ఉన్న‌ట్లు ఇటీవ‌ల కేంద్ర‌, వైద్య ఆరోగ్య‌శాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: