క‌రోనాకు మందు క‌నుక్కునే క్ర‌మంలో శాస్త్రీయ ప‌రిశోధ‌న‌ల‌తో పాటు ఆయుర్వేద కోణంలోనూ శోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.ఈ క్రమంలో భారతదేశంలో ఉన్న అని వైద్యశాస్త్రాల్లో పరిశోధనలకు కేంద్ర ప్ర‌భుత్వం ప్రొత్సాహ‌కాల‌ను కూడా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. దీంతో మెడికల్ ఆయుర్వేదం హోమియోపతి తదితర వైద్యశాస్త్రాల్లో ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ శోధ‌న‌ల్లో క‌రోనాకు విరుగుడుగా అశ్వ‌గంధ ప‌నిచేసే అవ‌కాశం ఉంద‌ని ఆ రంగంలోని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకు, ఎలా ప‌నిచేస్తోందో కూడా వివ‌రించి చెబుతుండ‌టం విశేషం. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మూలిక అశ్వగంధ పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. 


క‌రోనాను నివారించేందుకు  అశ్వగంధ సహజ మూలికలు, దాని పుప్పొడి దోహ‌దం చేస్తాయ‌ని తాజాగా దిల్లీ ఐఐటీ, జపాన్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్సుడ్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ టెక్నాలజీ సంయుక్త అధ్యయనంలో తేల‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించిన  పరిశోధన పత్రాన్ని జర్నల్‌ ఆఫ్‌ బయోమాలిక్యులర్‌ స్ట్రక్చర్‌ అండ్‌ డైనమిక్స్‌లో ప్రచురణకు అనుమతి కూడా ల‌భించింద‌ని దిల్లీ ఐఐటీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అశ్వగంధ నుంచి సేకరించిన సహజ మూలికలు, పుప్పొడి నుంచి తీసిన క్యాపెక్‌ యాసిడ్‌ పెంథాల్‌ ఈస్ట్‌ అనే క్రియాశీలక పదార్థాలకు వైరస్‌తో పోరాడే శక్తి ఉన్నట్లు పరిశోధనలో వెల్ల‌డైంద‌ని ప‌రిశోధ‌న బృందం స‌భ్యులు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.


అశ్వ‌గంధతో త‌యారు చేసే స‌రికొత్త   ఔషధంతో క‌రోనా మ‌ర‌ణాల‌శాతాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించవ‌చ్చ‌ని దిల్లీ ఐఐటీ బయోకెమికల్‌ అండ్‌ బయోటెక్నాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ డి.సుందర్ తెలిపారు.   అశ్వగంధ మలేరియాపై స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని గ‌తంలో నిరూపింద‌మైంది. చాలా మంది ఇప్ప‌టికీ అశ్వ‌గంధ‌ను మ‌లేరియా నివార‌ణ‌కు వాడుతుంటారు. ఇంకా చెప్పాలంటే ప్ర‌పంచ దేశాల‌కు పెద్ద దిక్కుగా మారిన  హైడ్రాక్సీ క్లోరోక్విన్తో పోలిస్తే సమర్థవంతంగా పని చేస్తుందని తెలిపారు. 

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: