మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ ఉధృత‌మైన నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తేల్చి చెప్పారు. కాగా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల విషయంలో రాష్ట్రాలు సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు దాదాపు 35 వేల కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయ‌ని వెల్ల‌డించారు. అయితే ముంబై, దాని ప‌రిస‌రా ప్రాంతాల్లోనే దాదాపు 20 వేల మంది వైరస్‌ బారిన ప‌డ్డార‌ని తెలిపారు. మిగ‌తా ప్రాంతాల్లో ప‌రిస్థితి అదుపులోనే ఉన్న‌ద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. 


అదే స‌మ‌యంలో పుణె, థానే, నవీ ముంబై, ఔరంగాబాద్‌లో మహమ్మారి కోరలు చాస్తూ ప్రకంపనలు కొనసాగింస్తుండ‌టంపై కొంత ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న మాట వాస్త‌వ‌మేనని అంగీక‌రించారు. అయితే  వైర‌స్‌ను నియంత్రించ‌డంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ యంత్రాంగం కృషిని విస్మ‌రించ‌లేమ‌ని చెప్పారు. మ‌రికొద్దిరోజుల్లో వ్యాధి వ్యాప్తి త‌గ్గ‌ముఖం ప‌డుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా మ‌హ‌రాష్ట్ర పోలీసులు లాక్‌డౌన్‌ను ఉక్కుపాదంతో అమ‌లు చేస్తున్నారు. మ‌రి నెల‌రోజుల పాటు రాష్ట్రంలో ఇదే ప‌రిస్థితి కొన‌సాగేలా ఉండ‌టంతో వ్యాపారులు కూడా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు.


కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌తో ముందు వారిలో ఆశ‌లు రేకెత్తిన ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని ముఖ్యమంత్రి తేల్చిచెప్ప‌డంతో నిరాశ‌లో మునిగిపోయారు. లాక్‌డౌన్‌ 4.0లోనూ నిబంధ‌న‌ల్లో ఎలాంటి మార్పు ఉండ‌బోదు..అన్ని నియ‌మాలు య‌థావిధిగా అమ‌లు చేయ‌బ‌డ‌తాయి.. ముంబైలోనూ పాత నిబంధనలే అమలవుతాయి. రెడ్‌జోన్‌ అయిన కారణంగా అనుమతి లేకుండా తిరిగే వాహనాలపై కఠిన చర్యలు ఉంటాయి. అవసరం లేకున్నా బయటకు వచ్చే వారిని జైలుకు పంపేందుకు కూడా వెన‌కాడ‌బోమ‌ని  ముంబై పోలీసులు ట్విటర్‌ వేదికగా హెచ్చ‌రించారు.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: