ప్రపంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌ను త్వ‌రిత‌గ‌తిన‌ గుర్తించేందుకు విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈక్ర‌మంలోనే కొత్త‌కొత్త ప‌ద్ధ‌తుల‌కు, పాత ప‌ద్ధ‌తుల్లోనే గుర్తించేందుకు అనేక మార్గాల‌ను శాస్త్ర‌వేత్త‌లు అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే జాగిలాలను కూడా ఉపయోగించి కరోనా వైరస్‌ సోకినవారిని గుర్తించేందుకు పరిశోధనలు కొన‌సాగిస్తుండ‌టం విశేషం. ఈ త‌ర‌హా విధానంలో బ్రిట‌న్‌,అమెరికా,ఫ్రాన్స్ వంటి దేశాలు కాస్త ముందంజ‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.  


ముఖ్యంగా  బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు విస్తృతంగా సాగిస్తున్నారు.  బ్రిట‌న్‌లో జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌ల‌కు  లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌, డర్హమ్‌ యూనివర్సిటీతోపాటు మరో స్వచ్ఛంద సంస్థ కలిసి పరిశోధనలు మొదలుపెట్టాయి. ఈ పరిశోధనల కోసం బ్రిట‌న్ ఏకంగా 5లక్షల పౌండ్లు  అంటే  ఇండియ‌న్ క‌రెన్సీలో దాదాపు నాలుగున్నర కోట్లు  కేటాయింపు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే కొవిడ్‌-19 గుర్తించేందుకు లాబ్రడర్‌, స్పానియల్‌ జాతికి చెందిన ఆరు జాగిలాలను శిక్షణ కోసం సిద్ధం చేశారు. ఒకవేళ ఇది విజయవంతమైతే.. ఒక్కో జాగిలం గంటకు 250 మందిని పరీక్షించగలుగుతుందని బ్రిట‌న్  శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


అంతే కాకుండా విమానాశ్రయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈ వైరస్‌ ఉన్న వారిని సులువుగా గుర్తించేందుకు అవ‌కాశం ఉంటుంది. వాస్త‌వానికి ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్‌ దేశాలు కూడా వైరస్‌ను గుర్తించేందుకు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేపనిలో పడ్డట్లు  విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. భార‌త్‌లో కూడా పోలీసుల ఆధ్వ‌ర్యంలో జాగిలాల‌కు శిక్ష‌ణ మొద‌లవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ శిక్ష‌ణ‌కు శాస్త్రీయ కోణంలో ఎంత మేర‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌న్న‌ది కూడా సందేహ‌స్ప‌దంగా మారింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: