వికారం.. ఏదో ఒక సంద‌ర్భంలో అంద‌రూ ఫేస్ చేసే స‌మ‌స్యే ఇది. ఇక మహిళలు గర్భం తో ఉన్నప్పుడు వికారం, వాంతులు రావడం సహజమే. అయితే వికారం కలగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అది మీ పొట్టలో పండ్లు, అసిడిటి, ప్రెగ్నెన్సీ లేదా స్టొమక్ అప్ సెట్ వంటివి కారణం కావచ్చు. వికారం మరియు కడుపు నొప్పి వంటివి అజీర్ణంతో సహా వివిధ ఆరోగ్య పరిస్థితులు మరియు ఫుడ్ పాయిజన్, వైరల్ గాస్ట్రో వంటివి బయటపడవచ్చు. మ‌రి ఇలాంటి స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు.. దీనికి ఎలా చెక్ పెట్టాలి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఇందులో ముందుగా.. అల్లంతో టీ చేసుకుని చల్లగా అయిన తర్వాత సేవించడం లేదా అల్లం ముక్కలుగా చేసుకుని నమలడం గానీ అల్లం వాసన చూడటం వలన వికారం తగ్గుతుంది. వికారానికి నిమ్మ‌కాయ‌లు అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లుపుకొని తాగితే వికారం త‌గ్గుతుంది. అలాగే నిమ్మ‌కాయ‌ల్ని వాస‌న చూసినా వికారం నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. అలాగే పుష్కలమైన విటమిన్స్ మరియు మినరల్స్ ఉండే ఆపిల్‌ జ్యూసీ ఫ్రూట్ వికారానికి మంచి విరుగుడుగా పనిచేస్తుంది.

 

మరియు మొత్తం ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరం మరియు స్టొమక్ అప్ సెట్ అనేది ఉండదు. అదేవిధంగా, పుచ్చకాయను ముక్కలుగా చేసుకుని లేదా పుచ్చకాయ జ్యూస్ గా చేసుకుని సేవించడం వలన వికారం నుండి బయటపడవచ్చు. ఇక ప్రోటీనుల లోపం వల్ల కూడా ఎక్కువగా వికారం పొదుతారు. నట్స్ లో బాదం మరియు పీనట్స్ వంటివి తీసుకోవడం వల్ల మీకు కావల్సినంత ఎనర్జీ అందివ్వడంతో పాటు వికారాన్ని నివారిస్తుంది. అలాగే పుదీనా వికారం మరియు కడుపు ఉబ్బరానికి సత్వర పరిష్కారంగా ఉపయోగపడే ఉత్తమ ఆహారంగా యూజ్ అవుతుంది. అందుకే వికారంగా ఉన్న‌ప్పుడు కాసేపు పుదీనా వాస‌న చూస్తే.. వికారం నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

 
 


  

మరింత సమాచారం తెలుసుకోండి: