వంట ఇంటిలో మిరియాలు లేని ఇల్లు ఉండదు. వంటకు రుచి రావాలంటే కొంచెం మిరియాల పొడి దట్టించాలిసిందే. కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా పరిగణించే మిరియాలని  కూరల్లో ఘాటును కోరుకునే వారు కారంకు బదులుగా మిరియాలను వాడతారు . ఒక్క రుచికి, ఘాటుదనానికి మాత్రమే మనం మిరియాలు వాడుతున్నాము అనుకుంటే అది చాలా తప్పు. మిరియాలలో అనేక అద్భుత ఔషధ గుణాలు దాగి ఉంటాయి. మిరియాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.  

 

మనందరికీ తెలిసినది మిరియాల వల్ల  ఒక్క జలుబు, దగ్గుమాత్రమే తగ్గుతుందని. కానీ మిరియాలతో అధిక బరువును కూడా  సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..మరెన్నో విధాలగా మేలుచేస్థాయి మిరియాలు. జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు తోడ్పడతాయి. లాలాజలం ఊరేలా చేస్తాయి. ఉదరంలో పేరుకున్న వాయువును వెలుపలికి నెట్టివేసే శక్తి మిరియాల సొంతం.దీనివల్ల మోషన్ అనేది ఫ్రీ గా అవుతుంది.  శరీరంలో రక్తప్రసరణా వేగవంతం అవుతుంది.దీనివల్ల శరీరంలో  కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. తమలపాకులతో మిరియాలు కలిపి తింటే బరువు త్వరగా తగ్గుతారు. వీటి వాడకం వల్ల శరీరంలో స్వేద ప్రక్రియ పెరుగుతుంది.

 

మూత్రవిసర్జన సాఫీగా సాగుతుంది. అలాగే.. అజీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు.మెత్తగా దంచిన మిరియాల పొడిని తగినంత పాతబెల్లంతో కలిపి చిన్న ఉండల్లా చేసి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే.. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.అలాగే శరీరంలో కొవ్వు నిల్వలు కూడా చాలా తగ్గుతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ మిరియాల పొడిని కలుపుకుని ప్రతిరోజు ఉదయం పడగడుపున తాగితే ఎంత కొవ్వయినా సరే కరిగిపోతుంది.

 

అల్లం రసం, తులసి ఆకులు, దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి వేసి చేసిన గ్రీన్ టీ తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే  కడుపులో మంట ఉన్నవారు,  వేళకు ఆహారం సక్రమంగా తీసుకోనివారు.. అధిక శరీర వేడి ఉన్నవారు.. మిరియాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటిలోని ఘాటైన ద్రవ్యాలు శరీరంలో మరింత వేడిని పెంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: