ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ఎంత‌టి విల‌య‌తాండ‌వం సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు క‌రోనా ముందు త‌ల‌వంచాల్సి వ‌చ్చింది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయ‌డం ప్ర‌భుత్వాల‌ను పెను స‌వాల్‌గా మారింది. అయిన‌ప్ప‌టికీ.. క‌రోనాతో ప్ర‌పంచ‌దేశాలు చేతిలో ఆయుధం లేకున్నా యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు క‌రోనాను నివారించేందుకు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.

 

అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు ఖ‌చ్చితంగా కొన్ని ఆహార జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. తక్కువ ఫ్యాట్ ఉండే మిల్క్, ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాకొలెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పని చేసీ చేసీ అలసటగా ఫీలైన‌ప్పుడు ఓ డార్క్ చాకొలెట్ తింటే వెంటనే మూడ్ మారుతుంది. మైండ్ ఫ్రెష్ అవుతుంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోంలో ఆకలి తీర్చే మరో హెల్తీ ఫుడ్ డ్రై నట్స్. బాదం, జీడిపప్పు, పిస్తా, వేరుశనగ గింజలు వంటివి ఆకలిని తగ్గిస్తాయి. చక్కటి ఎనర్జీ ఇస్తాయి. ఇంటి దగ్గర పనిచేసేవారు డ్రైఫ్రూట్స్, పప్పుల వంటివి తినడం తేలికగా ఉంటుంది.

 

వాస్త‌వానికి ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు... సరదాగా తినే స్నాక్స్, టీలూ, కాఫీల వంటివి ఇప్పుడు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు పని మానేసి వాటిని ప్రిపేర్ చేసుకోవడం కుదరని పని. అలాంటి స‌మ‌యంలో ఇలాంటివి తింటే ఆక‌లీ తీరుతుంది. ఆరోగ్యం కూడా. అలాగే  బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. పైగా మన బాడీకి అవసరమైన అమైనో యాసిడ్స్ బఠాణీల్లో ఉంటాయి. పైగా వీటిలో కేలరీలు తక్కువ. అందువల్ల... వేపిన బఠాణీలు రోజుకో అరకప్పు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మధ్యమధ్యలో వీటిని తింటే రిలాక్స్ అవ్వడమే కాదు సూప‌ర్ ఎన‌ర్జీని ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: