ఎన్నో సంస్కృతులకు చెందిన వంటకాల్లో టమాటా తప్పకుండా ఉంటుంది. ఎలాంటి వంటకమైన టమాట వేస్తే చాలు దానికి అద్భుత‌మైన రుచి వచ్చేసినట్లే. ఇంట్లో కూరగాయలు పెంచుకునేవాళ్ళు కూడా ఇతర కూరగాయల మొక్కలకంటే టమాటా మొక్కలనే ఎక్కువగా పెంచుతారు. కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందిట ఈ టమాట. ముఖ్యంగా  టమాటాలో విటమిన్‌ 'సి' పుష్కలంగా ఉంటుంది. అందువల్ల దీన్ని వంటల్లో చేర్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. 

 

టమాటాలో మెగ్నీషియం, ఫాస్పరస్‌, కాపర్‌లు కూడా ఉంటాయి. అలాగే టమాటాల్లో కాన్సర్‌ను అడ్డుకునే గుణాలున్నాయి. వాటిలో ఉండే లైకోపీన్... కొలన్, ప్రొస్టేట్, లంగ్ కాన్సర్లను అడ్డుకుంటోంది. బీపీని తగ్గించే లక్షణాలు టమాటాలకు ఉన్నాయి. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలు ఉండేవారు టమాటాలు తింటే మంచిది. ఇక ట‌మాటాల్లో ఉండే విటమిన్‌ కె, క్యాల్షియం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కంటిచూపు మెరుగవుతుంది. మ‌రియు శరీరంలో రక్తం సరిగా లేనివారూ, రక్త హీనతతో బాధపడేవారు టమాటాలు తింటే మంచి ఫ‌లితం ఉంటుంది. అయితే అతిగా తింటే.. ఏదైనా విష‌మే అవుతుంది. 

 

ఇందులు ట‌మాటాలు కూడా మిన‌హాయింపు కాదు. ఎవరైతే సాధారణంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారో అలాంటి వారందరూ పొటాషియం తీసుకోవడాన్ని పరిమితం చేయాలి. ఈ పొటాషియం అనేది ముఖ్యంగా టమోటాలలో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మరిన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. అందుకే ట‌మాటాల‌ను మితంగా వాడాలి. అలాగే ట‌మాటాలు అధికంగా వాడ‌డం వ‌ల్ల.. అందులో ఉండే సోడియం స్థాయిలో పెరగటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి ఇవి మరింత హానిని తలపెట్టగలవు. ఇక ఓ అధ్య‌య‌నం ప్ర‌కారం.. టమోటాలు మైగ్రేన్లను ప్రేరేపించేగలవు. అందుకే తలనొప్పి ఎదుర్కొంటున్న‌వారు.. టమోటాలో వినియోగం మితంగా మాత్ర‌మే ఉండాలి.
 
 
 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: