కొత్తిమీర‌.. దీని గురించి తెలియ‌ని వారుండ‌రు. ధనియాల మొక్కను మనం కొత్తిమీరగా పిలుస్తాము. మంచి సువావన కలిగి ఉంటే ఈ కొత్తిమీర‌ను వంటకాలలో విరివిగా వాడతారు. ముఖ్యంగా తెలుగువారు దాదాపు ప్రతి కూరలోనూ కొత్తిమీర‌ను వినియోగిస్తుంటారు. ఎందుకంటే..  ఇది వంటలకు రుచిని , సువాసనను అందిస్తుంది. అయితే కొత్తిమీరకు ఎందుకింత ప్రత్యేక స్థానం ఉందో ఎవరికీ అంతగా తెలియదు. కానీ సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటుంది. అంతే కాదు కొత్తిమీరలో ఆరోగ్యం దాగుందని నిపుణులంటున్నారు. కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్'ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. 

 

శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీరలో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాసియం వంటి వివిధ రకాల మినిరల్స్ పుష్క‌లంగా ఉన్నాయి. సోడియం తక్కువగా ఉంటుంది. హై పొటాషియం ..లోసోడియం వల్ల బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. అలాగే గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొత్తిమీర కాపాడుతోంది. హైబీపీని కంట్రోల్‌లో ఉంచుతూ, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. అలాగే సూక్ష్మక్రిములతో పోరాడే లక్షణాలు కొత్తిమీరకు ఉన్నాయి. తినే ఆహారం కల్తీ అయితే... మన ప్రాణాలకే ప్రమాదం. అలాంటి టైమ్‌లో కొత్తిమీర తీసుకోవడం ద్వారా చాలా మంచిది. 

 

ఎందుకంటే.. అందులోని డోడెసెనాల్ అనే పదార్థం బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమయ్యే సాల్మొనెల్లా బ్యాక్టీరియాకి కొత్తిమీర తగిలిందంటే ఇక అది నాశ‌నం అవ్వాల్సిందే. అదేవిధంగా, చర్మంపై దద్దుర్లు, మచ్చలు, మొటిమలు, గాట్లు, దెబ్బలు, గాయాలు, నీరు కారడం, ఉబ్బడం ఇలా ఏం జరిగినా... కొత్తిమీర తింటే చర్మం సంగతి అది చూసుకుంటుంది. ఇక కొత్తిమీర ఆహారాన్ని రుచి గానే కాకుండా, జీర్ణక్రియ రేటుని కూడా పెంచుతుంది. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గిస్తుంది. మ‌రియు కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా కూడా కొత్తిమీర స‌హాయ‌ప‌డుతుంది. అందుకే కొత్తిమీర‌ను మీ డైట్‌లో చేర్చుకోండి.

  

మరింత సమాచారం తెలుసుకోండి: