సాధార‌ణంగా చాలా మంది  బాడీ వెయిట్‌ను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా రాత్రిపూట అన్నం బదులుగా చపాతీలు తింటుంటారు. అయితే ఈ  చ‌పాతీల‌ను కేవలం నార్త్ ఇండియ‌న్స్ మాత్ర‌మే కాదు.. మ‌న తెలుగు వారు కూడా చాలా మంది ఇష్టంగా తింటారు.  గోధుమ పిండితో చేసే చ‌పాతీలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నిపుణులు కూడా చెబుతారు. గోధుమలో ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి. అందుకే అన్నం కంటే చపాతీలు ఆరోగ్యానికి మంచివి. గోధుమల ద్వారా చేసిన చపాతీ తినటం వలన చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే రాత్రి చేసిన చ‌పాతీలు ఉద‌యం తింటే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ట‌.

 

వాస్త‌వానికి రాత్రి పూట వండిన చపాతీలు ఉదయానికి మిగిలిపోతే.. అవి పడేస్తారు. ఎందుకంటే.. ఆహారం వండిన తర్వాత 12 గంటలు నిల్వ ఉంటే అందులో ఉండే పోషకపదార్ధాలు అంతమైపోతాయి కాబట్టి. కానీ చపాతీలు, రోటీలు ఎక్కువగా నిల్వ ఉన్నవి తింటేనే మనకు ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవును! రాత్రి చేసిన చపాతీల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని.. ఉదయాన్నే వీటిని టీ లేదా ఏదైనా మంచి సలాడ్, కర్రీతో తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్‌కి మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

 

అలాగే జీర్ణసమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడేవారు రోజూ రాత్రి పడుకునేముందు పాలల్లో చపాతీలను నానబెట్టి ఉదయం తినడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చ‌ని అంటున్నారు. అంతేకాకుండా, రక్త హీనతతో బాధపడుతున్న వారికి కూడా నిల్వ చపాతీలు తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. మ‌రియు హైబీపీతో బాధపడేవారు నిల్వ‌ చపాతీలను ప‌ది నిమిషాలపాటు గోరువెచ్చని పాలల్లో నానబెట్టి తినడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది. కాబట్టి ఎక్కువగా నిల్వ ఉన్న చపాతీలు తినడం మొదలు పెడితే బెట‌ర‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: