ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ నుండి తప్పించుకోవడానికి ఎక్కడ చూసినా జనాలు మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా కంపల్సరిగా బయటికి వస్తే మాస్క్ ధరించాలి అని నియమ నిబంధనలు కంపల్సరీ చేసేశాయి. ఎవరైనా మాస్క్  ధరించకుండా బయట కనబడితే వాళ్లకి భారీ స్థాయిలో ఫైన్ లు కూడా వేస్తున్నాయి. దీంతో మాస్క్ ధరల కు రెక్కలు వచ్చినట్లు అయ్యింది. మార్కెట్ లో భయంకరంగా మాస్కులు అమ్ముడు పోతున్నాయి. ఇదిలా ఉండగా కరోనా నుండి బయటపడటానికి ధరించే మాస్క్ తో ముప్పు, ఎక్కువ టైం ధరించడం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గి పోయి స్పృహతప్పి పడిపోయే అవకాశం ఉందని ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

IHG

అయితే వస్తున్న వార్తల్లో నిజం ఎంత? నిజంగా మాస్క్  ధరించడం వల్ల అటువంటి ప్రమాదం జరుగుతుందా? అంటే మాస్కులను ఎక్కువ సమయం పాటు ధరించడం వల్ల ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతోందని, తద్వారా స్పృహ కోల్పోతారనే వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే మాస్కులను మరీ అంత టైట్‌గా ధరించరు. కాస్త వదులుగానే ఉంటాయి. అందువల్ల గాలి ఆడుతుంది. 

IHG

ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే శ్వాస తీసుకోవడం వదలడం కొందరికి ఇబ్బందికరంగా ఉంటుందని, వాటి వల్ల గాలి తీసుకోవటం సమస్యగా అనిపిస్తుంది. అంతేగాని కరోనా మాస్క్ ధరించడం వల్ల ఊపిరి ఆగిపోయి చనిపోయే అంత పరిస్థితి ఉందనే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని వైద్యుల చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఏ వార్త పడితే ఆ వార్త చదివి ఆందోళనకు గురి కావద్దని సూచిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: