సాధార‌ణంగా చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగందే రోజు గ‌డ‌వ‌దు. ఒక్కపూట టీ తాగకపోతే ఏదో వెలితిగా ,తలనొప్పిగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది.  అయితే టీ తాగడం వ‌ల్ల నష్టాలున్నాయనంటూ కొన్ని వార్తలు వస్తాయి.. కాని, వాటిని కొట్టిపారేస్తున్నాయి కొన్ని పరిశోధనలు.  టీ కేవలం ఓ రిఫ్రెష్‌మెంట్ మాత్రమే కాదు. అది హెల్త్ కి కూడా ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. వాస్త‌వానికి కాఫీ కంటే టీ లో యాభై శాతం తక్కువ కెఫీన్ ఉంటుంది. ఇక హెర్బల్ టీ ల లో అసలు కెఫీనే ఉండదు. అంటే నెర్వస్ సిస్టం కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా టీ తాగచ్చన్న మాట. 

 

కొన్ని పరిశోధనల్లో టీ వల్ల ఎముకలు బలోపేతమౌతాయని తెలుస్తోంది. పాలలో కంటే ఎక్కువ కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, కే, ఉన్న మొరింగా టీ బలమైన ఎముకలు కావాలనుకునేవాళ్ళకి మంచి బెస్ట్‌ ఆప్షన్ అని అంటున్నారు నిపుణులు. అలాగే  టీ కేవలం ఆరోగ్య పరంగానే కాదు.. అందాన్ని కూడా మెరుగు చేస్తుందని చెబతున్నారు నిపుణులు. టీ తాగితే వయసు తగ్గి.. శరీరం ముడతలు పడకుండా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక‌ టీ తాగడం వల్ల పళ్ళ మీద ఎనామిల్ పోకుండా ఉంటుంది. కేవిటీస్ ఏర్పడవు. అందువల్ల టీ రెగ్యులర్ గా తాగేతే మంచిదంటున్నారు.

 

అదేవిధంగా, ఒక కప్పు టీ తాగడం వల్ల ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. టీ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. టీ తాగడం వల్ల ఒంటి నొప్పులు కూడా త‌గ్గుతాయ‌ని అంటున్నారు. అలా అని అతిగా తాగితే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదు‌ర్కోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా అధిక మోతాదులో టీ తాగ‌డం వ‌ల్ల‌…నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. టీ లోని థీయోఫైలిన్ అనే రసాయనం డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది. ఇది మలబద్దకానికి దారి తీస్తుంది. కాబ‌ట్టి, రెగ్యుల‌ర్‌గా మోతాదు మించ‌కుండా టీ తాగితే బెట‌రంటున్నారు నిపుణులు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: