క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ఈ పేరు వింటేనే భ‌య‌ప‌డిపోతున్నారు. అంత‌లా ఈ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే దేశ‌దేశాలు వ్యాప్తిచెంద‌డం, ల‌క్ష‌ల మంది ప్రాణాలు బ‌లితీసుకోవ‌డం, మ‌రెంద‌రినో హాస్ప‌ట‌ల్ పాల‌య్యేలా చేయ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. ఇక ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 64 లక్షలు దాటాయి. 

 

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఏ వ‌స్తువు కొనుగోలు చేయాలన్నా నోట్లను ఇచ్చిపుచ్చుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజల ఇంకా నోట్లనే వాడుతున్నారు. అయితే ప్రతిరోజు కొన్ని వేల మంది చేతులు మారే ఈ కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా లేదా అనేది చాలామందిలో ఉన్న సందేహం. దీంతో క‌రెన్సీ నోట్ల‌ను కొందరు వాటిని సబ్బుతో కడుగుతున్నారు. కొందరు ఇస్త్రీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే టిప్స్ పాటిస్తే.. క‌రెన్సీ నోట్ల ద్వారా క‌రోనా రాకుండా చెక్ పెట్ట‌వ‌చ్చు. అందులో ముందుగా.. కరెన్సీ నోట్లను ముట్టుకున్న చేతులతో ముఖం, కళ్లు, నోటిని ముట్టుకోకూడదు. 

 

నోట్లు తీసుకున్నవెంట‌నే చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. నోట్లను తాకిన తర్వాత చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటే వైరస్, బ్యాక్టీరియాలు చనిపోతాయి. క‌రెన్సీ నోట్ల‌నే కాదు.. చెక్‌ బుక్‌లు తాకిన తర్వాత కూడా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి. ఇక సాధార‌ణంగా ఏటీఎం కేంద్రాల్లో చాలామంది డబ్బులు డ్రా చేస్తారు. అందుకే మీరు ఒక‌ టూత్ పిక్ తీసుకెళ్లండి. ఏటీఎంలోని బటన్స్‌ను టూత్ పిక్‌తో క్లీక్ చేయండి. డబ్బులు డ్రా చేశాక ఆ టూత్‌పిక్ పాడేయండి. డెబిట్, క్రెడిట్ కార్డులను ముట్టుకున్న తర్వాత కూడా తప్పకుండా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి. ఇక డెబిట్, క్రెడిట్ కార్డులను ముట్టుకున్న తర్వాత కూడా తప్పకుండా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: