క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది. అందులో కీల‌క‌మైన‌వి కొన్ని ఉన్నాయి.  విమానాలు, రైళ్లు, బస్సుల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేవారందరికీ వారం పాటు క్వారంటైన్ తప్పనిసరి చేస్తున్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ గురువారం ప్రకటించ‌డం గ‌మానార్హం.  అయితే  కరోనా లక్షణాలు ఉన్నవారు మినహా ప్రతిఒక్కరికి క్వారంటైన్ అవసరం లేదంటూ గతంలో తీసుకున్న నిర్ణయానికి కేజ్రీవాల్ స‌వ‌ర‌ణ‌లు చేశారు. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నా లేకున్నా...ఢిల్లీ వ‌చ్చే వారెవ‌రైనా క్వారంటైన్లో వారం పాటు ఉండాల్సిందేన‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేశారు. గ‌త  వారంలో వరుసగా సడలింపులు అమల్లోకి రావడంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో 23,645 కరోనావైరస్ కేసులు ఉన్నాయి. గడిచిన వారంలో రోజుకు సగటు 1,200 కొత్త కేసులు నమోదయ్యాయి.


భారత్‌లో కరోనా జోరు క‌నిపిస్తోంది. రోజురోజుకూ విశ్వరూపం చూపిస్తోంది... గ‌డిచిన ప‌క్షం రోజుల్లోనే కేసుల సంఖ్య‌ రెట్టింపు కావ‌డం గ‌మ‌నార్హం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన  హెల్త్ బులెటిన్లోని వివరాల‌ ప్రకారం.. గడచిన 24 గంటలలో 9,304 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,919కు చేరుకోగా.. మరణించినవారి సంఖ్య 6,075కు చేరుకుంది. ఒకేరోజు 260 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,06,737 యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనాబారిన పడి కోలుకుని ఇప్పటి వరకు దేశంలోని వివిధ ఆస్పత్రుల నుంచి 1,04,107 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. 


ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో మంగళవారం 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవి 87 కాగా, 12 కేసులు వలస కూలీలకు వచ్చినవి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 70 కేసులు నమోదయ్యాయి.  అమెరికాలో మళ్లీ కరోనా జోరు కనిపిస్తుంది. అమెరికాలో ఓ ఐదు రోజుల నుంచి కొత్త కేసులు, మరణాల నమోదు తగ్గుతోంది. అయితే తాజాగా 21,203 కేసులు నమోదవ్వడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు  అమెరికాలో క‌రోనా కేసుల మొత్తం  సంఖ్య 18,80,526కి చేరాయి. అలాగే 1132 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 108057కి చేరుకోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: