అధిక బరువు.. ఇటీవ‌ల కాలంలోనే ఈ స‌మ‌స్య‌తో అనేకమంది బాధపడుతుంటారు. ఈ క్ర‌మంలోనే శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలను, అధిక బరువును తగ్గించుకోవడానికి చాలామంది నానా ఇబ్బందులుపడుతుంటారు. ఇందుకోసం ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతుంటారు. ఎలాంటి ఆహారాలు తినాలో తెలియక క‌డుపు కాల్చుకుంటుంటారు.  ఆహారపు అలవాట్లు, జీవన శైలి, వ్యాయామం లేకపోవడం, గంటల కొద్దీ కూర్చొని పనిచేయడం, ఇంట్లో ఉన్నంతసేపూ కూర్చునే ఉండటం, నిద్రలేమి , ఒత్తిడి ఇలా అధిక బ‌రువుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ అధిక బరువును తగ్గించేందుకు ఎంతో శ్రమిస్తుంటారు. 

 

నిజానికి అధిక బరువుతో బాధపడేవారు చిన్నపాటి చిట్కాలను పాటించినట్టయితే ఖచ్చితంగా బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చంటున్నారు నిపుణులు. అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్న‌వారు రోజుకు రెండుసార్లు ప‌చ్చిమిర్చి తినడం మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప‌చ్చిమిర్చిలో యాంటీఆక్సిడెంట్లు, జీరో కేలరీలు ఉంటాయి. కారం తినడం వల్ల జీర్ణక్రియ కనీసం 50 శాతం మెరుగుపడుతుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే పచ్చి మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది.

 

బరువు తగ్గాలనుకునే వారికి పచ్చిమిర్చి మంచి ఔషధం అనే చెప్పాలి. శరీరంలో ఉండే అధిక కొవ్వుని కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. వీటిల్లో ఉండే క్యాప్సెయిసిన్ శరీర మెటబాలిజం ప్రక్రియను వేగవంతం చేసి క్యాలరీలు త్వరగా ఖర్చయ్యేలా చేస్తుంది. అందుకే రోజూ మీరు తినే ఆహారంలో పచ్చిమిర్చిని తప్పనిసరిగా వేసుకోండి. స్వీట్ సాస్ బదులు మిర్చి సాస్ వాడండి. అంతేకాదు, పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పచ్చి మిరపలో విటమిన్ బి6, విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: