ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రికవరీ రేటు భారీగానే ఉన్నప్పటికీ ఏపీలో కరోనా కేసులు 4 వేలు దాటడం గ‌మ‌నార్హం.  ఏపీలో తాజాగా 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మరో  ఇద్ద‌రు క‌రోనాతో మ‌ర‌ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 9,831 మంది కి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 138 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ ఫ‌లితాల్లో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 88 ఉండగా.. రాష్ట్రంలో 50 పాజిటివ్‌ కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,250 కేసులు నమోదయ్యాయి క‌రోనా కార‌ణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య73గా ఉంది. 

 

అలాగే 2,294 మంది ఆరోగ్య వంతులుగా మారి ఇంటికి చేరారు. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1,060 మంది చికిత్స పొందుతున్నారు. అయితే గ‌తంతో పొలిస్తే కేసుల సంఖ్య రాష్ట్రంలో త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లుగానే చెప్పాలి. ఇప్పుడు యాక్టివ్ కేసులు 1060గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 21 మంది కోలుకున్నారు. వారిని డిశ్చార్జి చేశారు. కరోనా కారణంగా కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చనిపోయారు. ఇదిలా ఉండ‌గా భారత్‌లో కరోనా దావానలంలా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 

 

భారత్‌లో గురువారం ఒక్క‌రోజే 9,304 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. మొత్తంగా భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,919కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 1,06,737లు ఉన్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 260 మంది మరణించినట్లు కేంద్రం పేర్కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 6,075కు చేరుకుంది. 1,04,107 మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకుని హోం క్వారంటైన్లో ప‌ డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం పేర్కొంది. భారత్‌లో ఒక్క రోజులో 9వేలకు పైగా పాజిటివ్ కేసులు, 250 మందికి పైగా కరోనాతో మరణించడం ఇదే తొలిసారి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: