అప్పుడప్పుడు గొంతు బొంగురుపోవడం ఎవరికైనా సహజమే. చాలా వరకూ ఈ స్థితి 'స్వయం అంతం'గా. అంటే తనంతటతానే నెమ్మదించేదిగా ఉంటుంది. గొంతు బొంగురు పాడడానికి వైరస్, ఎలర్జీలు సాధారణ కారణాలు, చక్కగా విశ్రాంతి తెసుకోవడం. ఆవిరిని పీల్చడం మొదలయిన చర్యలతో ఒకటి రెండు వారాలలోనే ఈ ఇబ్బంది నుంచి బైట పడవచ్చు. అలా కాకుండా, పక్షం రోజులు దాటినా తరువాత కూడా గొంతు బొంగురు కొనసాగుతుంటే దాని గురించి శ్రద్ధ వహించడం అవసరం. ఆయుర్వేద సంహితాకారుల్లో ముఖ్యుడైన చరకుడు ఈ లక్షణాన్ని ఎనభై రకాల వాత వ్యాధులలో ఒకటిగా, 'కంఠోధ్వంసం' అనే పేరుతో వ్యవహరించాడు.

 

వివిధ ఆయుర్వేద గ్రంథాలు గొంతు బొంగురుపోవడాన్ని స్వర భంగం, స్వర క్షయం వంటి పేర్లతో వర్ణించాయి. గొంతు బొంగురు పోవడమనేది నిజానికి అల్పమైన లక్షణం. ఐతే, ఒకోసారి ప్రమాదకరమైన వ్యాధులు కొన్ని గొంతుబోరుగుతోనే మొదలవుతుంటాయి. నలభైయ్యేళ్ళు పైబడిన వారిలో, అందునా ధూమపానం అలవాటు వున్న వారిలో గొంతు బొంగురు అనే లక్షణం దీర్ఘకాలం నుంచి కొనసాగుతున్నట్లయితే క్యాన్సర్ ప్రమాదాన్ని శంకించి జాగ్రత్త పడవలసి ఉంటుంది.

 

గొంతు బొంగురు ఉన్నప్పుడు వైద్యులు దీనికి కారణమైన హేతువులను అన్ని కోణాలనుంచి విశ్లేషిస్తారు. ఒక్కొక్క కారణాన్ని గురించి ఆలోచిస్తూ చివరకు ప్రాణానికి ప్రమాదాన్ని కలిగించే స్వరతంత్రుల ట్యూమర్ల గురించి కూడా పరీక్షిస్తారు. ఇలా చేయడం వల్ల సరైన సమయంలో సరైన విధంగా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. గొంతుబొంగురు అనే లక్షణం ఈ కింది వ్యాధులు లేదా సందర్భాలన్నీటిలోనూ కనిపించే అవకాశం ఉంది.

 

1.ఒక లోటాడు నీళ్లను బాగా మరుగబెట్టి, దానిలో కొంచెం పసుపు, తులసి ఆకులు వేసి ఆవిరిని పీల్చితే ఉపశమనం లభిస్తుంది.

 

2. ఉప్పు నీళ్ళతో పుక్కిట పడితే గొంతుబొంగురు నుంచి రిలీఫ్ లభిస్తుంది.

 

3. పిప్పళ్ళు, ఉప్పు, ఉసిరికాయల వొలుపు, తేనెలను మెత్తగా పేస్టులా చేసి నాకితే గొంతుబొంగురులో మంచి ఫలితం ఉంటుంది

 

4. ఆహారం కొద్దిమొత్తాలలో తరచుగా తినాలి.

 

5. కారం, పులుసు, మాసాలాలు తగ్గించాలి.

 

6. ధూమపానం మద్యపానాలు పనికిరావు.

 

7. బరువు తగ్గాలి. 

8. ఆహారం విషయంలో సమయపాలన పాటించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: