ఉద‌యం నిద్ర లేవ‌గానే….. ప‌ద్మాస‌నం లో కూర్చొని, కొద్ది దూరంలో స‌రిగ్గా మ‌న కంటికి స‌మాన‌మైన దిశ‌లో ఓ వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తూ ఉండాలి…. మారుతున్న దాని మంట రంగు, గాలికి క‌దులుతూ త‌న షేప్ ను మార్చుకుంటున్న తీరును కూడా ఓ 5 నిమిషాల పాటు త‌దేకంగా ప‌రిశీలిస్తూ ఉండాలి…అటు త‌ర్వాత… ఆ వెలుగుతున్న కొవ్వొత్తిని ఆర్పివేసి…ఇప్పుడు క‌ళ్లు మూసుకొని ఇంత‌కు ముందులా కొవ్వొత్తి వెలుగుతున్న‌ట్టు ….మ‌నో నేత్రంతో చూడాలి.  ఇలా ప్ర‌తిరోజు..చూస్తూ ఉండాలి…. అయితే మొద‌టి రోజు 5 నిమిషాల పాటు వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తే…క్ర‌మంగా ఆ స‌మ‌యాన్ని త‌గ్గించుకుంటూ పోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తితో పాటు ఊహాశ‌క్తి కూడా అమాంతం పెరుగుతుంది.  

 

మన జీవితంలో జ్ఞాపకశక్తి కీలకపాత్ర పోషిస్తుంది. మనం చేసే అన్ని పనులకూ ఇదే మూలం. కాబట్టి జ్ఞాపకశక్తి తగ్గకుండా చూసుకోవటం చాలా అవసరం. రోజూ కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని కాపాడుకోవచ్చు.   రోజువారీ పనుల ఒత్తిళ్లో.. లేనిపోని వాగ్వాదాలో.. ఇలాంటివన్నీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తాయి. నిజానికివి కొద్దిరోజుల్లో సర్దుకుపోతాయి గానీ దీర్ఘకాలంగా కొనసాగితే జ్ఞాపకశక్తిపై  విపరీత ప్రభావం చూపొచ్చు. కాబట్టి ఒత్తిడిని నియంత్రించుకోవటం, తగ్గించుకోవటం అత్యవసరం. గాఢంగా శ్వాస తీసుకోవటం, యోగా, ఒక అంశం మీద దృష్టి నిలపటం వంటి పద్ధతులతో ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు.  

 

కంటి నిండా నిద్రపట్టకపోతే ఆ రోజంతా చికాకుగా ఉండటం తెలిసిందే. ఏ విషయాలూ చప్పున గుర్తుకురావు కూడా. జ్ఞాపకశక్తికి నిద్ర ఎంత అవసరమో దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. నిద్రలోనే మనం నేర్చుకున్న విషయాలు జ్ఞాపకాలుగా స్థిరపడతాయి. కాబట్టి రాత్రిపూట కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి. కొందరు నిద్రలేమికి మాత్రలు వేసుకుంటుంటారు గానీ ఇవి మెదడు పనితీరుకు ఆటంకం కలిగించి జ్ఞాపకశక్తి తగ్గేలా చేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి ముందుగా రోజూ సమయానికి నిద్రపోవటం, లేవటం.. పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవటం.. సాయంత్రం తర్వాత కాఫీ, టీలు తాగకపోవటం వంటి పద్ధతులను పాటించటం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: