మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విల‌యం కొన‌సాగుతోంది. వేల సంఖ్య‌లో ఈ రాష్ట్రంలో క‌రోనాకు బ‌ల‌వుతుండ‌గా కొత్త‌గా నిత్యం వేలాదిమందికి క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతోంది. తాజాగా మ‌హారాష్ట్ర సామాజిక‌,న్యాయ శాఖా మంత్రి, ఎన్సీపీ నేత ధనుంజయ్‌ ముండే కరోనా వైరస్‌ బారిన పడ్డారు. అయితే ఆయనలో వైరస్‌ లక్షణాలు బయటపడలేదని..కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి రాజేశ్‌ తోపే శుక్రవారం మీడియాకు తెలిపారు.కాగా ధనుంజయ్‌ ముండే కంటే ముందు మహారాష్ట్ర మంత్రులు జితేంద్ర అవధ్‌(ఎన్సీపీ), అశోక్‌ చవాన్‌(కాంగ్రెస్‌)లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. 

 

ధనుంజయ్‌ ముండే రెండు రోజుల కిత్రం ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా కేబినెట్‌ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఆ కార్య‌క్ర‌మంలో ఆయనతో ఎవరెవరు భేటీ అయ్యారో, ఆయన ఎవరెవరిని కలిసారో తెలుసుకునేందుకు అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. ధనుంజయ్‌ ముండే ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు.. కేబినెట్‌ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, మంత్రులకు భారత వైద్య పరిశోధనా మండలి నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని తోపే తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఆ రాష్ట్ర ఆరోగ్య‌శౄఖ మంత్రి రాజేష్ తోపే మాట్లాడుతూ మంత్రి ధ‌నుంజ‌య్‌కు కరోనా పాజిటివ్‌ ఫలితం వచ్చింది నిజమేన‌ని నిర్ధారించారు. 

 

ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంద‌ని, కంగారే ప‌డాల్సిన ప‌నేమీ లేద‌ని వెల్ల‌డించారు. లక్షణాలు బయటపడలేద‌ని అయితే శ్వాసతీసుకోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్న‌ట్లు తెలిపారు  బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలోని ఐసోలేష‌న్ ఆస్ప‌త్రిలో ఆయ‌న‌కు వైద్యం చేయిస్తున్న‌ట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రజలంతా దయచేసి స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధ పడుతున్నట్లయితే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  కాగా మంత్రులకు భారత వైద్య పరిశోధనా మండలి నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని రాజేశ్‌ తోపే తెలిపారు.ఇదిలా ఉండగా.. గురువారం నాటికి రాష్ట్రంలో 97,468 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. కరోనా మృతుల సంఖ్య 3590కి చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 10956 మందికి కరోనా సోకగా.. 396 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: