క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19‌.. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన ఈ మ‌హ‌మ్మారి.. ప్రస్తుతం ప్రపంచ మొత్తం వ్యాప్తిచెందింది. కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌పంచ‌దేవాల‌ను తీవ్ర స్థాయిలో ఈ క‌రోనా భూతం వ‌ణికిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌దేశాల‌కు ఉమ్మ‌డి శ‌త్రువుగా మారింది క‌రోనా. రోజుల తరబడి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నా..  కరోనా వైరస్ తీవ్రతలో ఎలాంటి మార్పూ కనిపించట్లేదు. రోజురోజుకూ అది మరింత విస్తరిస్తోంది. ఈ వైరస్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌పంచ‌దేశాల ప‌రిశోధ‌కులు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. 

 

అయితే నెల‌లు గ‌డుస్తున్నా ఇంతవరకు ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయాయి. ఖ‌చ్చిత‌మైన వ్యాక్సిన్ తయారు చేద్దామన్నా వైరస్ తన రూపాలను మార్చుకొంటూ ఉగ్ర‌రూపంతో విరుచుకుప‌డుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఓ ప‌రిశోధ‌న‌లో షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.  ప్ర‌స్తుతం అమెరికా పరిశోధకులు అందుబాటులో ఉన్న ఔషధాలపైనే పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీబీ, పోలియో వ్యాక్సిన్‌లతో కరోనా బారి నుంచి తాత్కాలిక రక్షణ పొందొచ్చని చెబుతున్నారు. ఈ విషయం పరిశోధనల్లో తెలిసినట్లు వారు పేర్కొన్నారు. అయితే మ‌రోవైపు, కరోనాపై పోరుకు పోలియో టీకాను ఉపయోగించొచ్చని మరికొందరు చెబుతున్నారు.

 

కానీ, టీబీ, పోలియో టీకాల వల్ల బాధితులకు ముప్పు తక్కువని, ఇప్పటికే వీటిని  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇచ్చారని పాక్ సంతతికి చెందిన అమెరికన్ ప్రొఫెసర్ అజ్రా రజా పేర్కొన్నారు. అంతేకాకుండా.. టీబీ, పోలియో వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిని పెంచి కరోనా రాకుండా తాత్కాలికంగా రక్షణ కల్పిస్తాయని వాషింగ్టన్ పోస్ట్ కథనం కూడా ప్రచురించింది. అయితే టీబీ వ్యాక్సిన్ కరోనాను కట్టడి చేస్తుందా అనే అంశంపై  అమెరికా, నెదర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో క్లినికల్ పరీక్షలు సాగుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నుంచి తాత్కాలిక రక్షణ పొందేందుకు టీబీ వ్యాక్సిన్ ఒక్కటేనని అంటున్నారు. మ‌రియు దీని వలన ఊపిరితిత్తుల సమస్యతో పాటు ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: