తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు చురు కుదనం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడిం చింది. ‌జూన్ 1న కేర‌ళ తీరాన్ని తాకిన నైరుతి రుతుప‌వనాలు ఆ త‌ర్వాత మెల్ల‌గా క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోకి ప్ర‌వేశించి ఇప్పుడు తూర్పు, ఈశాన్యం దిశ‌గా క‌దులుతున్నాయి. ఇన్నాళ్లు నిదానంగా క‌దిలిన  నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు ఊపందుకున్నాయ‌ని భార‌త వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది.

 

ఇప్ప‌టికే  పశ్చిమ మధ్యప్ర దేశ్‌లో మరికొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో తెలంగాణ‌లో సోమ‌వారం రాత్రి నుంచి మొద‌లైన వాన‌లు  మంగళవారం నిజామా బాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రా ద్రి, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలా బాద్‌, కొమరంభీం, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో కూడా కొన‌సాగుతాయ‌ని తెలిపింది. అంతేకాకు  నాలుగైదు చోట్ల భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 

 


ఇదిలా ఉండ‌గా నైరుతి ప‌వ‌నాలు క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోకి ప్ర‌వేశించి ఇప్పుడు తూర్పు, ఈశాన్యం దిశ‌గా క‌దులుతున్నాయి. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల నుంచి ఏడు కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అని తెలిపింది. ఉత్తర బంగాళా ఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సుమారుగా జూన్ 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.మ‌రోవైపు రాజస్థాన్ నుంచి బెంగాల్ వరకు అల్పపీడనం ఏర్పడనుందని, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలపై ఈ అల్ప‌పీడ‌నం ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: