ఇప్పుడు చిన్నపిల్లలా నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే సమస్య నొప్పులు. చిన్న పెద్ద అని తేడ లేకుండా ప్రతి ఒక్కరికి నొప్పులు వస్తున్నాయి. అయితే అలా నొప్పులు పొందేవారు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.

 

వయసు మీద పడిన వారికి వచ్చే నొప్పులను మనం పూర్తిగా తగ్గించలేకపోయినప్పటికీ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చెయ్యాలి అప్పుడే మీ నొప్పులు తగ్గుతాయి. 

 

మానసిక ఒత్తిళ్ళకు దూరం అవుతే పలు రకాల నొప్పులు యిట్టె తగ్గిపోతాయి. 

 

ఎక్కువ ఇష్టమైన వారితో గడపటం, ఆహ్లాదకరమైన సన్నివేశాలను చూడటం వంటి వాటి వల్ల కూడా నొప్పుల బాధ తగ్గుతుంది.

 

నొప్పులతో బాధ పడేవారు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం ఎంతో అవసరం. 

 

వయసుపైబడింది అని ఏ పని చెయ్యకుండా ఉండకూడదు. చిన్నదో పెద్దదో ఏదో ఒక పని అయితే చెయ్యాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఏ పని చేయకపోవడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయి. 

 

ఏ వయసు వారు అయినా సరే కంప్యూటర్ వర్క్ చేసినప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి అటు ఇటు తిరగాలి. అప్పుడే ఆరోగ్యంగా తయారవుతారు. 

 

ధూమపానం, మద్యపానం నొప్పులను పెంచుతాయి .. అందుకే ఆ అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి. 

 

సరైన భంగిమలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి.. అప్పుడే నొప్పులు ఉండవు. 

 

బరువులు ఎక్కువగా ఎత్తకూడదు.. నడుము పూర్తిగా వంచకుండా, మోకాళ్ళ వరకే వంచాలి.. అప్పుడే సమస్యలు ఉండవు. 

 

ఊబకాయం వంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. 

 

కాఫీని పరిమితంగానే తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల నొప్పులు ఈజీగా తగ్గుతాయి.

 

చూశారుగా.. ఈ జాగ్రత్తలు పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: