అల్లం.. ఇది ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉంటుంది. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. అయితే ఖరీదైన మందులు కూడా నయం చేయలేని ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఒక చిన్న అల్లం ముక్క నయం చేస్తుంది అంటే న‌మ్ముతారా..? మీరు న‌మ్మినా.. న‌మ్మ‌క‌పోయినా అది నిజం. విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్ర‌స్తుతం కరోనా వైరస్ శ‌రవేగంగా విస్త‌రిస్తున్న‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో రోజూ అల్లాన్ని మీ డైట్‌లో చేర్చుకోండి.

IHG

అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే రక్తాన్ని పలుచగా చేయడంలోనూ అల్లం బాగా పనిచేస్తుంది. ఇది గుండెపోటు వచ్చే వారికి, వస్తుందనుకున్న వారికి ఉపయోగపడే విషయం. వారు అల్లం రసంను నిత్యం సేవిస్తే రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. 

IHG

ఇక  సహజంగా వచ్చే దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమోఘంగా పనిచేస్తుందనే చెప్పాలి. విపరీతమైన దగ్గు ఇబ్బంది పెడుతుంటే వెంటనే అల్లం, ఉప్పు కలిపి తీసుకోంటే మంచి ఫ‌లితం ఉంటుంది. కడుపు ఖాళీ కావడానికి అల్లం బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నవారికి అల్లం చాలా మంచిది. అదేవిధంగా, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం అల్లం రసం సేవిస్తుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇలా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్న అల్లంను ఖ‌చ్చితంగా డైట్‌లో చేర్చుకోవ‌డం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: