దేశంలో కరోనా వైరస్ కోరలు చాచుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల మార్క్ దాటింది. రోజు రోజుకీ కొత్త కేసుల నమోదులో రికార్డు సృష్టిస్తోంది. గత వారం రోజుల నుంచి ప్రతి రోజు 10 వేల పైబడే కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,413 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అయితే మ‌రో ల‌క్ష కేసుల న‌మోదుకు 3 నుంచి 4రోజుల క‌న్నా త‌క్కువ స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,10,461కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 306 మంది కరోనాతో మృతి చెందడటంతో మొత్తం మృతుల సంఖ్య 13,254కు చేరింది. ఇప్పటి వరకు 2,27,755 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,69,451 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 


తెలంగాణ రాష్ట్రంలో  కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు ఎక్కువ‌గా జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే కేసులు ఎక్కువ‌గా న‌మోదు వ‌చ్చినా శ‌నివారం వెల్ల‌డైన ఫ‌లితాల్లో ప‌లు జిల్లాల నుంచి గ‌రిష్ట సంఖ్య‌లోనే కొత్త కేసులు ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. శ‌నివారం ఒక్క జ‌న‌గామ జిల్లాలోనే 10 కేసులు న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం. అలాగే రంగారెడ్డి 50కి పైగా కేసులు న‌మోద‌య్యాయి. తెలంగాణ‌లో మొత్తం  గడిచిన 24 గంటల్లో 546 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య   7702కి చేరింది. కరోనాతో ఇవాళ ఐదుగురు మరణించారు.  దీంతో మొత్తం మరణాల సంఖ్య 203కి చేరింది.   నమోదైన మొత్తం కేసుల్లో 3363కేసులు యాక్టివ్ గా ఉంటె, 3506 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

 

నమోదైన 546 కరోనా కేసుల్లో జీహెచ్ఎంసి పరిధిలోనే 458 కేసులు ఉన్నాయి. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు పరుస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో లాక్‌డౌన్ కూడా విధించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు అధికారులకు, సిబ్బందికి, ఉద్యోగులకు కీలక మర్గదర్శకాలు విడుదల చేసింది. కార్యాలయంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదని హైకోర్టు రిజిస్ట్రర్ రాజశేఖర్ పలు సూచనలు చేశారు. ముంబై, ఢిల్లీ, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు వంటి రాష్ట్రాల‌ను క‌రోనా వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ‌లోనూ అదే ప‌రిస్థితి నెల‌నొనే ప్ర‌మాదం స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: