అధిక బ‌రువు.. నేటి కాలంలో అంద‌రూ ప్ర‌ధానంగా ఎదుర్కొంటున్న స‌మ‌స్య ఇది. చాలా మంది కొంచెం లావు అయితే చాలు.. బ‌రువు ఎలా త‌గ్గాల‌ని తెగ హైరానా ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే బరువు తగ్గడానికి చాలామంది ఏమీ తినకుండా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కానీ దాని వల్ల అనర్థమే ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇలా కాకుండా క‌రివేపాకుతో కూడా సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు. మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషద గుణాలు కరివేపాకులో ఉన్నాయి. అటువంటి కరివేపాకును ప్రతి ఇంట్లోనూ తమ వంటల్లో ఏదో ఒక సందర్భంలో తప్పక వాడుతుంటారు.

 

అస‌లు కరివేపాకు లేని కూరలు రుచి ఉండ‌వు అంటే అతిశ‌యోక్తి కాదు. కరివేపాకు చూడటానికి వేప ఆకులా ఉంటుంది. అందుకే ఇండియాలో దీన్ని 'స్వీట్ నీమ్' అనికూడా పిలుస్తారు.  కరివేపాకు కేవలం వంటలకు మాత్రమే కాదు, వివిధ అనారోగ్యాల‌ను కూడా త‌రిమికొడుతుంది. కరివేపాకులో యాంటీ సెప్టిక్‌ గుణాలు ఉండడం వల్ల శరీరంలోపై ఎలాంటి గాయం అయినా తగ్గుముఖం పడుతుంది. కళ్లకు మేలు చేస్తుంది, జుట్టు పెరుగుదలకు, చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న క‌రివేపాకు బరువును తగ్గించడంలోనూ ఎంతగానో మేలు చేస్తుంది.  

 

అందుకు కరివేపాకు ఆకులని తీసుకుని పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి. ఆ ర‌సానికి కొద్ది తేనె క‌లిపి పొద్దున్నే తాగితే శరీరానికి కావాల్సిన క్లోరోఫిల్ తో పాటూ ఎన్నో విటమిన్స్ కూడా అందుతాయి. ఈ గ్రీన్ జ్యూస్ ని రోజూ తాగితే కొన్ని రోజుల తరువాత పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది. మ‌రియు ప్ర‌తి రోజు భోజనానికి ముందు కొన్ని కరివేపాకు ఆకులు నమిలి తింటే శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు.  ఇక కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది కళ్ళ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. కరివేపాకును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కళ్ళ సంబంధించిన జబ్బులను నివారించుకోవచ్చు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: