మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన అధిక బరువును ఎలా అయినా సరే తగ్గించుకోవాలి. అప్పుడే మన జీవనం బాగుంటుంది. అంతేకాదు ఆరోగ్యంగా కూడా తయారవుతాం. మనం సన్నగా తయారవ్వాలి అంటే కొన్ని అద్భుతమైన చిట్కాలు పాటించాలి. అప్పుడే ఆరోగ్యంగా తయారవుతాం. లేదు అంటే ఆరోగ్యంగా ఉండలేము. అందగాను ఉండలేము. 

 

ఉదయం లేవగానే బ్రష్ చేసి వెంటనే గోరు వెచ్చని నీటిలో నిమ్మ చెక్కను పిండి, చెంచా తేనె కలిపి తాగితే కొవ్వు కరుగుతుంది. అంతేకాదు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

 

రోజూ ఉదయమే గంటసేపు రన్నింగ్ లేదా జాగింగ్ చేయాలి. బయటికి వెళ్లలేకపోతే ట్రెడ్ మిల్ వాడినా సరిపోతుంది.

 

వ్యాయామం తర్వాత కాఫీ, టీ కంటే కూడా ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి. ఇందులోని 'కెటాచిన్' అనే రసాయనం కొవ్వును బాగా కరిగిస్తుంది.

 

ఇంకా ఉదయం టిఫిన్ గా పండ్లు, పండ్ల రసాలు, ఎగ్ వైట్ వంటి పోషకాహారాలు ఉండాలి. 

 

మెలకువగా ఉన్న సమయంలో గంటకి ఒకసారైనా కొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. ఎంత తాగితే అంత మంచిది. కూల్ డ్రింకులు అసలు తాగకూడదు. 

 

బరువు తగ్గాలంటే బద్ధకం అసలు ఉండకూడదు. ఉదయం వ్యాయామం చేసి రోజంతా కూర్చుని, పడుకొని ఉంటే ఏ మార్పూ ఉండదు. 

 

బరువు తగ్గాలంటే సమయానికి తినటం, పడుకోవటం చేయాలి. అప్పుడే జీవక్రియలు సరిగా జరుగుతాయి. రాత్రి ఎక్కువసేపు మేలుకోవటం, పగటిపూట నిద్ర అసలు పనికిరాదు.

 

సాయంత్రం చిరుతిండిగా జంక్ ఫుడ్, సమోసా, బజ్జీలకు బదులు గ్రీన్ సలాడ్, పండ్లు, నువ్వుల ఉండలు, మొలకలు, ఉడికించిన గింజల వంటివి తీసుకోవాలి.

 

రాత్రి 8 గంటలకల్లా భోజనం ముగించాలి. భోజనానికి నిద్రకు మధ్య కనీసం 2 గంటలు సమయం ఉండేలా చూసుకోవాలి. కుదిరితే రోజు రాత్రి ఒక జ్యుస్ తాగితే మంచిది. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: