యాపిల్‌.. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రోజుకో యాపిల్ తింటే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతారు. ఎందుకంటే.. యాపిల్ లో ఉండే పోషక పదార్థాలు మ‌నల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

IHG

అంతేకాదు, యాపిల్‌ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకోవ‌చ్చు.  యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. మలబద్ధకపు సమస్యను దూరం చేస్తుంది. అలాగే అనేక సమస్యలకు మూలమైన అధిక బరువును తగ్గించడానికి యాపిల్‌ మంచి పరిష్కారం. కేలరీలు తక్కువగా ఉండి కడుపునింపడంలో యాపిల్ ముందుంటుంది.

IHG

అయితే ఎన్నో పోష‌కాలు ఉన్న యాపిల్‌ను రాత్రి వేళల్లో తినకపోవడమే మంచిది. ఎందుకంటే.. యాపిల్ లో ఉండే యాసిడ్స్ కడుపులో యాసిడ్ స్థాయులను పెంచుతాయి. అలాగే యాపిల్ రాత్రి తింటే అందులో ఉన్న పెక్టిన్‌, పీచు పదార్థాల వల్ల యాపిల్ త్వరగా జీర్ణం కాదు. దీని తో జీర్ణ సమస్యలు వస్తాయి. కనుక యాపిల్‌ను పగటి పూట తింటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప‌గ‌టిపూట యాపిల్ తిన‌డం వ‌ల్ల తేలిగ్గా జీర్ణమవుతుంది. మ‌రియు  రోగ నిరోధక శక్తిని కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఇక యాపిల్స్‌ని కొని, తినేటప్పుడు వాటిని శుభ్రంగా కడిగి తినాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: