మధుమేహం.. ప్రస్తుత రోజుల్లో ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరికి ఉండే సమస్య ఇది. మధుమేహం అనేది అనారోగ్యంగా కాకపోయినప్పటికి ఇది ఒక శారీరిక మార్పు. కానీ నిర్లక్ష్యం చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయి. ఎన్నో ప్రమాదక రోగాలకు ఇది దారితీస్తుంది. అందుకే మధుమేహం తమ రక్తంలోని ఎంత స్థాయిలో ఉంది అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. 

 

ఇంకా మధుమేహం వస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఇంకా ఈ లక్షణాలు అన్ని మధుమేహంకు సంబంధించినవే.. పదేపదే మూత్రానికి పోవాల్సిరావటం, అనవసరంగా బరువు తగ్గటం, అలసట, నీరసం, చూపు మందగించటం, గాయాలు మానకపోవటం, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, చిగుళ్ళు ఎర్రగా మారి వాపు కనిపించటం, కుటుంబ పెద్దల్లో ఎవరికైనా మధుమేహం లేదా ఊబకాయం ఉండడం.. మితిమీరిన దాహం, ఆకలి ఉండడం వంటివి అన్ని మధుమేహ కారక సమస్యలే. 

 

ఇన్ని సమస్యలు అదుపులో ఉండాలి అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఆ జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఆహారంలో కొవ్వు పదార్థాలు తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి.. ఖాళీ కడుపుతో అసలు ఉండకూడదు. అలాగని కడుపునిండా తినకూడదు. ప్రతి నాలుగు గంటలకు ఒకసారి విడతలుగా పరిమితంగా ఆహారం తీసుకోవడం మంచిది.

 

పీచు పదార్థాలున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. రోజూ 40 నిమిషాలు అలసిపోయేలా వ్యాయామం చెయ్యాలి. రోజంతా ఒకేచోట కూర్చోవటం, బద్దకమైన జీవనశైలిని మానేయాలి. పాదాలకు గాయాలు అవ్వకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి పాదాల్ని గోరు వెచ్చని నీటిలో ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే ఎన్నో సమస్యలను ఇచ్చే మధుమేహాన్ని కూడా కంట్రోల్ చెయ్యచ్చు.                                                

మరింత సమాచారం తెలుసుకోండి: