అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ మేరీల్యాండ్ కి చెందిన డాక్టర్ ఫహీమ్ యూనస్ అంటువ్యాధుల క్లినికల్ విభాగంలో సూపర్ స్పెషలిస్ట్ గా పేరు గాంచారు. ఇటువంటి తరుణంలో ప్రపంచమంతా కోవిడ్ 19 తో విలవిలలాడుతున్న సందర్భంలో ఈ ప్రముఖ వైద్యుడు చెప్పిన జాగ్రత్తలు అంతర్జాతీయంగా చాలా దేశాలు పాటిస్తున్నాయి. అది ఏమిటో మనం కూడా చూద్దాం…

 

1. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కోవిడ్ 19 తో భవిష్యత్తులో దానితో జీవించాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కాగా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లటం మంచిది. అంతేగాని కరోనా వైరస్ గురించి ఆలోచన పెట్టుకుని భయంగా భయపడి బతకాల్సిన అవసరం లేదని, ఈ ప్రముఖ అంటువ్యాధుల అంతర్జాతీయ వైద్యుడు కొన్ని జాగ్రత్తలు సూచించారు 

 

2. నీరు విపరీతంగా తాగడం వల్ల కానీ లేదా మరో పద్ధతి వల్ల గాని ఈ ప్రమాదకరమైన వైరస్ ని చంపడం కుదరదు. కోవిడ్ 19 తప్పించుకోవాలని విపరీతంగా నీరు త్రాగటం వల్ల… ఎక్కువగా టాయిలెట్ కి వెళ్ళటం తప్ప వైరస్ నుండి తప్పించుకునే అవకాశం ఉండదని చెబుతున్నారు.

 

3. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవటం, రెండు     మీటర్లు భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు  పాటించడం వలన మాత్రమే వైరస్ నుండి తప్పించుకోవటం జరుగుతుందట. 

 

4. మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ఎప్పుడు చేయాలంటే కోవిడ్ 19 రోగి ఉన్న టైం లో, మామూలుగా అయితే శుభ్రంగా ఉంచుకోవటం బెటర్ అట.

 

5.కార్గో ప్యాకేజీలు, పెట్రోల్ పంపులు, షాపింగ్ బండ్లు లేదా ఎటిఎంలు వలన కోవిడ్ 19 సంక్రమించే అవకాశం లేదట.

 

6. అదేవిధంగా ఫుడ్డు ఆర్డర్ ద్వారా కూడా కోవిడ్ 19 సంక్రమించే అవకాశం లేదట.

 

7. ఇది ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్, చుక్కలతో మనిషి తుమే సమయములో నోటి నుండి బయటపడే తుఫారులు వాళ్ళ మాత్రమే ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఫుడ్ ద్వారా ఇది వ్యాప్తి చెందే అవకాశం లేదు. 

 

8. అలాగే రుచి కోల్పోవటం మరియు వాసన సరిగ్గా పిల్చలేక పోవటం వలన కోవిడ్ 19  అని భావించి అక్కర్లేదు. మామూలుగా మనిషి  అనేక అలెర్జీలు మరియు వైరల్ ఇన్ఫెక్షన్లతో కూడా వాసన కోల్పోవటం జరుగుతుంది. కాబట్టి రుచిగాని మరియు వాసన పీల్చే గుణం గాని కోల్పోతే కంగారు అవసరం లేదంట.

 

9. కోవిడ్ 19 భయంతో ఒక్కసారిగా కంగారుగా బయట నుండి ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్నవారిని కంగారు పెట్టాలా బట్టలు మార్చడం మరియు అత్యవసరంగా స్నానం చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదట. గాలి ద్వారా కాకుండా తుపరులు వల్ల అది కూడా దగ్గర పరిచయం ఉంటేనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కాబట్టి బయట నుండి వచ్చిన వెంటనే ప్రతిసారి బట్టలు ఉతుక్కోవడం వేస్ట్ అని చెప్పుకొస్తున్నారు. 

 

10. గాలి ద్వారా సంక్రమించే అవకాశం లేదట. కాబట్టి తోటలలో మరియు పార్కులలో తిరగ వచ్చట. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న గాలి కలుషితం లేని ఖాళీ మంచి గాలి అని చెబుతున్నారు.

 

11. వైరస్ బారిన పడకుండా యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు అవసరం లేదు, ఇది వైరస్ కాబట్టి నార్మల్ సబ్బుతో పోతుందట.

 

12. ఆహారం చల్లగా ఉన్న టైంలో తినాలా?  లేకపోతే వేడిగా ఉన్న టైంలో తినాలా? అనే దాని విషయంలో కంగారు పడక్కర్లేదు. అంతగా డౌటు ఉంటే వేడి చేసుకుని తినొచ్చు. 

 

13. ఇంటికి వేసుకునే చెప్పులు ద్వారా గాని షూస్ ద్వారా గాని ఈ మహమ్మారి కోవిడ్ 19 సోకే ప్రమాదం లేదట, కాబట్టి ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని వైద్యులు చెబుతున్నారు. 

 

14. జ్యూస్ ల ద్వారా అల్లం ద్వారా వెల్లుల్లి ద్వారా ఈ మహమ్మారి కోవిడ్ 19 ని అరికట్టాలి అనుకుంటే అది పొరపాటే, వీటిని తీసుకోవడం వల్ల ఒంట్లో ఇమ్యూనిటీ మాత్రమే పెరుగుతుంది.

 

15. మాటిమాటికీ మాస్కులు ధరించడం వల్ల ఆక్సిజన్ లెవెల్ లు తగ్గిపోతాయి. కాబట్టి జనసాంద్రత ఉన్న చోట మాస్క్ ఉపయోగించడం మంచిది.

 

16. గ్లౌస్ వేసుకోవడం వల్ల కోవిడ్ 19 నుండి తప్పించుకునే అవకాశం పెద్దగా ఉండదట, పైగా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవటం ఉత్తమమైన మార్గమని వైద్యులు అంటున్నారు.

 

17. కోవిడ్ 19 ఎదుర్కోవాలంటే ముఖ్యంగా ఇంటిలో ఇమ్యూనిటీ పెంచే పదార్థాలను ఎక్కువగా తీసుకునే లాగా డైట్ మైంటైన్ చెయ్యాలట. అలాగని ఇంట్లో తినేసి కూర్చుని ఉండకూడదట. కాస్త అటు ఇటు అడుగులు వేయాలని ఈ ప్రముఖ అంతర్జాతీయ మేరీల్యాండ్ డాక్టర్ చెప్పుకొచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: