గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిత్యం ఒక్క నగరంలోనే వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈక్ర‌మంలోనే హైదరాబాద్‌ కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో పది మంది వైద్య సిబ్బందికి, నలుగురు రోగులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారందరికీ అత్యవసరంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే కొండాపూర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. ఆయ‌న‌తో పాటు మ‌రో  10 మంది వైద్య సిబ్బంది, నలుగురు పేషెంట్లకు కరోనా సోకింది. దీంతో వారందరికి అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

 

మూడు రోజులుగా సూపరింటెండెంట్‌ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనకు పాజిటివ్ అని తేలడంతో అదే హాస్పిటల్‌లో ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. సూపరింటెండెంట్‌‌తో ప్రైమరీ కాంటాక్ట్ అయినవారి ఆచూకీ కోసం వెతుకు తున్నారు. ఇందులో భాగంగా ఆస్పత్రి సిబ్బంది అందరికి ఆరోగ్య శాఖ కరోనా టెస్టులు నిర్వహించనుంది.గ్రేట‌ర్ ప‌రిధిలోని నగర వాసులను కరోనా వైరస్ వణికిస్తోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ బారిన పడుతున్నారు. నిత్యం 700కిపైగా పాజిటీవ్‌ కేసులు నమోదవుతూ నగరంలో కరోనా వైరస్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. వైరస్‌ కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా..వైరస్‌ మాత్రం చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. 


అటు ప్రభుత్వం కూడా ఇవాల్టి నుంచి హైదరాబాద్‌ సహా మిగతా 5 జిల్లాల్లో 50వేల మందికి కరోనా టెస్టులను నిర్వహిస్తోంది. వచ్చే 10 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కృషి చేస్తోంది. ఇదిలా ఉండ‌గా  హైదరాబాద్గో కుల్‌చాట్‌ యజమాని (72)కి కరోనా పాజిటివ్‌ రావడం కలకలం సృష్టించింది. అయితే ఇక్క‌డ వివిధ రుచులు చూసిన వారి ఆచూకి క‌నుగోనేందుకు పోలీసులు నానా తంటాలు ప‌డుతున్నారు. గోకుల్‌చాట్‌ను మూసివేయించడంతో పాటు 20 మంది సిబ్బందిని, కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. కరోనా పా జిటివ్‌ వచ్చిన యజమాని ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారో వైద్య సిబ్బంది, పో లీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: