అవును.. కరోనా లక్షణాన్ని తరిమికొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.. కానీ ఆ కరోనా లక్షణాన్ని ఈజీగాతరిమికొట్టచ్చు . అయితే ఆ కరోనా లక్షణం ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండీ.. జలుబు. ఈ జలుబును సహజంగా ఎలా పోగొట్టాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. జలుబును తరిమికొట్టండి. 

 

IHG

 

సాధారణంగా జలుబు వస్తే పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. కానీ ఇప్పుడు కరోనా కాలం కాబట్టి జలుబు వస్తే ఎక్కడ కరోనా వచ్చిందో అని అందరూ తెగ బెదిరిపోతున్నారు. అందుకే ఈ చిట్కాలు మీ కోసం. 

 

జామకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. రోగనిరోధక శక్తి మెండుగా ఉండే పండు ఇది. 

 

జామకాయలో విటమిన్‌-సి అధికమొత్తంలో ఉంటుంది. కాయలో కాకుండా పండులో ఈ విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ జామపండు రోగనిరోధకశక్తిని అధికంగా పెంచి ఇన్ఫెక్షన్స్‌ రాకుండా కాపాడుతుంది.

 

IHG

 

ఈ జమ పండులో విటమిన్‌- ఎ, విటమిన్-సి ఎక్కువగా ఉంటాయి. ఈ పండును తరచు తీసుకోవడం వల్ల కంటి శుక్లాలు పెరగవు. రెటీనా పాడవకుండా కాపాడుతుంది. వయసు పైబడటం వల్ల వచ్చే కంటి సమస్యలనూ అడ్డుకుంటుంది.

 

ఈ పండులోని పీచు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

 

ఇంకా జలుబు, దగ్గు ఉన్నప్పుడు పచ్చి జామకాయను తింటే అందులోని వగరు... మ్యూకస్‌ ను పలుచగా చేస్తుంది. దీంతో జలుబు, దగ్గు తగ్గుముఖం పడతాయి.

 

IHG

 

మలబద్ధకంతో బాధపడేవారు జామకాయను జ్యూస్‌లా తీసుకుంటే వెంటనే మంచి ఫలితం ఉంటుంది. 

 

చూశారు కదా! ఈ జమ పండును తినండి.. కరోనా లక్షణం అయినా జలుబును తరిమి కొట్టండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: