క‌రోనాకు టీబీకి కొన్ని కామ‌న్ సిమ్‌ట‌మ్స్‌ను వైద్య నిపుణులు క‌నుగొన్నారు. సాధార‌ణంగా టీబీ వ్యాధితో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తి అనేగానే ముందుగా గుర్తుకు వ‌చ్చే ల‌క్ష‌ణం  ద‌గ్గ‌డం. టీబీ అంటు వ్యాధి. ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వలన వ్యాప్తి చెందుతుంది. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి శ్వాసకోశ క్షయవ్యాధిని కలుగజేస్తాయి. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి. శరీరంలోని ఇతర భాగాలకి కూడా క్షయ వ్యాధి రావచ్చు. అనగా శ్వాసకోశేతర భాగాలు ఎముకలు, కీళ్ళు, లింపు గ్రంధులు, మెదడు పొరలు, మూత్ర పిండాలు, గర్భ సంచి మొదలైనవి. మూడు వారాలకి పైగా దగ్గు, కఫం, సాయంత్రం, రాత్రి సమయాలలో జ్వరం, బరువు తగ్గుట, ఆకలి తగ్గుట, దగ్గు కఫంతోపాటు రక్తంపడటం వంటి ల‌క్ష‌ణాల‌తో దీన్ని గుర్తించ‌వ‌చ్చు.    


కరోనాలో ముఖ్య లక్షణం దగ్గే. కోవిడ్‌–19లో కూడా అచ్చం అలాగే. కాకపోతే... ట్యూబర్క్యులోసిస్‌ బ్యాసిల్లస్‌ అనే బ్యాక్టీరియాతో  టీబీ వస్తుంది. నావల్‌ కరోనా వైరస్‌ వల్ల కోవిడ్‌–19 సంక్ర‌మిస్తుంది. టీబీ మనిషి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది.  టీబీ ఊపిరితిత్తులతో పాటు  మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, యుటెరస్‌ వంటి కీలక అవయవాలపై ప్ర‌భావం చూపుతుంది. 
క‌రోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ లక్షణాలు కనిపించడానికి కనీసం ఐదురోజుల సమయం పడుతుంది. మరికొందరికి ఇంకా ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు. ఈ వైరస్‌ 14 రోజుల వరకు శరీరంలో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా వైరస్‌ మాత్రం ఊపిరితిత్తులను మాత్రమే గాక కొంతవరకు జీర్ణవ్యవస్థలోని పేగులనూ, చాలా అరుదైన సందర్భాల్లో మెదడునూ ప్రభావితం చేస్తుంద‌ని గుర్తించారు. 

 

దగ్గు, జ్వరంతో వ్యాధిని కల్పించే కారకాల్లో టీబీ... బ్యాక్టీరియా వల్ల; కోవిడ్‌–19 కరోనా వైరస్‌ వల్ల వచ్చి... లక్షణాలూ, వ్యాపించే తీరు దాదాపుగా ఒకేలా ఉన్నప్పటికీ టీబీ – కరోనాల విషయంలో పోలికలూ, తేడాలను గుర్తించి, రెండింటి పట్ల అవగాహన పెంచుకుని, ఇరు వ్యాధుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరమ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇప్పటికైతే కరోనా వల్ల వచ్చే కోవిడ్‌–19కు లక్షణాల ఆధారంగానే చికిత్స ఉంది. రెమ్‌డిస్‌విర్, ఫావిపిరావిర్‌ లాంటి మందులు మార్కెట్లోకి వచ్చినప్పటికీ అవి మైల్డ్‌గా, మాడరేట్‌గా ఉన్న వ్యాధిని మరింత తీవ్రతరం కాకుండా నియంత్రించేవే తప్ప... పూర్తిగా నయం చేసే మందులు కావు. అయితే టీబీకి పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. ఒకవేళ పూర్తి చికిత్స తీసుకోకపోతే ఇది అత్యంత ప్రమాదకారిగా మారవచ్చ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: