క్యారెట్.. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టేస్టీ, స్వీటీవెజిటేబుల్ క్యారెట్‌ను ప్రతి ఒక్కరు ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా క్యారెట్ ను కూరగా వండుకొని తీసుకోవడం కంటే పచ్చిగా ఉన్నప్పుడు తిన‌డానికే ఎక్కువ మంది ఇష్ట‌ప‌డ‌తారు.  అన్ని సీజన్లలోనూ ల‌భించే క్యారెట్‌.. ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూర్చుతుంది. క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.  చర్మ సమస్య, జుట్టు పొడిబారుట వంటి సమస్యలు క్యారెట్‌ తింటే తొలగిపోతాయి.

IHG

అలాగే క్యారట్ గుండెపోటు, పక్షవాతం వంటి భ‌యంక‌ర స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది. ఎందుకంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అందుకే క్యారట్ ఓ క్యాన్సర్ పోరాటయోధుడు. ఉత్తమ యాంటీ-క్యాన్సర్ ఉద్యమ కార్యకర్త. దీంతో పాటు సంతాన సాఫల్యతకు కూడా క్యారెట్ ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా పురుషుల్లో వీర్య కణాల కదలిక వేగంగా ఉండడానికి క్యారెట్ చాలా మేలు చేస్తుందని ప‌రిశోధ‌న‌లో తేలింది‌.

IHG

అదేవిధంగా, క్యారెట్‌లో రక్తహీనతను పోగొట్టే గుణం ఉంది. రక్తహీనతకు కూడా క్యారెట్‌ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అధిక పోషక విలువలుండటం వల్ల క్యారెట్‌లో రోగ నిరోధక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఇందులోని రోగ నిరోధకశక్తి వలన కఠినమైన మొండి రోగాలు, దీర్ఘ వ్యాధులకు సైతం చెక్‌ చెప్పవచ్చునంటు న్నారు ఆరోగ్య నిపుణ‌లు. ముఖ్యంగా ఈ క‌రోనా స‌మ‌యంతో ఖ‌చ్చితంగా రోజుకో క్యారెట్ తీసుకోమ‌ని నిపుణులు సూచిస్తున్నారు. కాబ‌ట్టి, ఎలాంటి నిర్ల‌క్ష్యం చేయ‌కుండా క్యారెట్‌ను మీ డైలీ డైట్‌లో చేర్చుకోండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: