కళ్ళు.. మన శరీరభాగంలో ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవయవం ఇదే. ఇంకా అలాంటి ఈ కంటి పని తీరు బాగుండాలి అంటే కంటి లోపలి భాగాల్లో తగినంత తేమ ఉండాలి. కానీ పెరిగిన కాలుష్యం, మారిన జీవనశైలి, విశ్రాంతి లేమి వంటి కారణాల కారణంగా కాంతిలో తేమ తక్కువ అయ్యేలా చేస్తున్నాయి. 

 

ఇంకా కంటిలో తేమ తగ్గడానికి కారణాలు ఇవే.. కన్నీటి గ్రంథుల వ్యాధులు, కండ్లకలక వంటి సమస్యలు, ప్లాస్టిక్‌, పింగాణీ, రసాయన, తోలు పరిశ్రమల్లో పనిచేయటం వల్ల, మూత్ర విసర్జనను పెంచే, రక్తపోటును తగ్గించే మందులు వాడటం, గర్భనిరోధక మాత్రలు వాడటం
మానసిక ఒత్తిడి, మొటిమలు, నిద్రలేమి, ఎలర్జీ, జీర్ణకోశ వ్యాధులకు మందులు వాడటం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. 

 

ఇంకా కంటిలో తేమ శాతం తగ్గింది అన్నప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..  కళ్లు ఎర్రబారడం, నలకలు పడి దురద అనిపించటం, కళ్లు అలసిపోవడం, కనురెప్పలు బరువెక్కడం, అతిగా కంటి రెప్పలు కొట్టుకోవడం వంటివి లక్షణాలు. ఇంకా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే నష్టాలు ఉండవు. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 

 

రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. ఇంకా ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు కూలింగ్ గ్లాసెస్ వాడాలి. వేసవిలో కళ్లకు చల్లని ఐప్యాక్‌ తరచుగా వాడటం.. కీర దోస ముక్కలను కళ్ల మీద పెట్టడం మంచిది. కంప్యూటర్ పై పనిచేసే సమయంలో యాంటీగ్లేర్‌ కళ్లద్దాలు ఉపయోగించడం చెయ్యాలి. ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు.                                                                

మరింత సమాచారం తెలుసుకోండి: