పాల‌కూర‌.. దీని గురించి తెలియ‌ని వారుండు. సాధార‌ణంగా మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పాల కూరను చాలామంది ఇష్టపడుతారు. పప్పు, కూర ఎలా చేసినా దీని టేస్టే వేరు. అయితే కొంద‌రు మాత్రం పాలకూరంటే తినడానికి ఇష్టపడరు. కానీ అందులో ఉండే పోషకాల గురించి తెలిస్తే ఈసారి మమ్మీని అడిగి మరీ వండించుకుని తింటారు. అవును! పాలకూర పిల్లలకు, పెద్దలకు అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తుంది. జ్ఞానశక్తిని మెరుగుపరుస్తుంది. 

IHG

పాల‌కూర అనారోగ్యాల్ని దూరం చెయ్యడమే కాదు... నిరంతరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది కూడా. దీనిని మీ ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పాలకూరలోని ప్రత్యేక పోషకాలు భయంకరమైన సమస్యలని కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా గుండె సమస్యలు, కాన్సర్ వంటి సమస్యలు దూరం అవుతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాన్సర్ కణాలతో వ్యతిరేకంగా పాల‌కూర గ్రేట్‌గా పోరాడుతుంది. మ‌రియు గుండెకి కూడా మేలు చేస్తుంది. 

IHG

అలాగే పాలకూరలో విటమిన్‌-కె ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఇక‌ ఇందులో విటమిన్ బి ఎక్కువ. ఇది మన జీవక్రియను సహజసిద్ధంగా చురుకుగా ఉండేలా చేస్తుంది. పాలకూరలోని ఐరన్, మన కండరాలకు ఆక్సిజన్ చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది. అందువల్ల కండరాలు తమ చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించేస్తాయి. ప్రతిరోజూ పాలకూరను తినడం వల్ల, మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చటానికి సహాయపడుతుంది. ఈ ఆకుకూరలో బీటా కెరోటిన్‌, ల్యూటిన్‌, క్లోరోఫిల్‌-2 ఉంటాయి. ఇవి కంటిచూపును కాపాడుతాయి. సో.. పాల‌కూర‌ను మీ డైలీ డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: