భారత్‌లోని కొన్ని న‌గరాల్లో  హెర్డ్ ఇమ్మ్యూనిటి వచ్చేసిన‌ట్లుగా వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఇంద‌కు వారు కొన్ని ఉదాహార‌ణ‌లు కూడా చూపెడుతుండ‌టం గ‌మ‌నార్హం. ముంబైలోని అతిపెద్ద మురికివాడల కాలనీ "ధారవి" లో కేసులు తగ్గిపోతున్నాయి అని అన్ని వార్త సంస్థలు విశ్లేషిస్తున్నాయి. అదే విధంగా హైద్రాబాద్ లోని కొన్ని మురికివాడలలో మిగిలిన సంపన్నుల కాలనీలకన్నా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం. వీటికి ప్రధాన కారణం ఆయా ప్రాంతాల్లో వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందడమే, అలా జరగడం వల్ల అక్కడి ప్రజల్లో చాలా వరకు ఇమ్మ్యూనిటి అభివృద్ధి చెంది వైరస్ వ్యాప్తి చెందే మార్గాలు మూసివేయబడ్డాయి. అదే హెర్డ్ ఇమ్మ్యూనిటి.మురికి వాడల్లో ఉండే వారికి సహాజ రోగనిరిధకత్ కూడా ఎక్కువ. ఇప్పుడు ఢిల్లీలో కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి.

 

 ఎక్కడయితే కేసులు బాగా ఎక్కువున్నయో అక్కడ అతి త్వరలో తగ్గుతాయి. వైరస్ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుంది. దేశమంతా ఒకే సారి తగ్గడం జరుగదు. దేశ జనాభాలో 15% వరకు ఇమ్మ్యూనిటి అభివృద్ధి చెంది ఉంటుందని నా అంచనా. కానీ, దేశవ్యాప్త హెర్డ్ ఇమ్మ్యూనిటి రావాలంటే 65% మందికి రావాలి...అది సుదూర తీరం. కానీ ఇప్పటికీ భారతీయులు ఈ వైరస్ ని సమర్ధవంతంగా అడ్డుకుంటున్నట్టే లెక్క... మనలో ఉన్న అంతర్గత రోగ నిరోధక శక్తి ఇందులో ప్రధాన భూమిక పోషిస్తుంది...ఈ వైరస్ పై మన విజయం వాక్సిన్ కన్నా, మందుల కన్నా ముందే జరుగవచ్చు.


ఇదిలా ఉండ‌గా భారత్‌లో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. రోజురోజుకీ వైరస్ వ్యాప్తి క్రమేనా విజృంభిస్తూ.. బాధితుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటుంది. దీంతో దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 24,850 కేసులు నమోదు కాగా.. 613 మంది వైరస్ కారణంగా మరణించారు. తాజా కేసులతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కు చేరింది. మరణాల సంఖ్య కూడా ఏ మాత్రం తీసుపోకుండా 19,268కి చేరింది. కాగా, ప్రస్తుతం 2,44,814 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. మరో 4,9,083 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని బులెటిన్‌లో స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: